సిద్ధార్థ రెడ్డి + ఎమ్మెల్యే ఆర్థర్ = ఆధిపత్య పోరు..?

MOHAN BABU
నందికొట్కూరు వైసిపి లో నువ్వా నేనా. 2019 నుంచి ఇదే పంచాయతీ. ఎమ్మెల్యే ఆర్థర్, చైర్మన్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య ఉప్పు నిప్పులా ఉంది ఆధిపత్య పోరు. ఇప్పుడు కొత్త రగడ ఇద్దరి మధ్య సయోధ్య మిథ్యేనా ఎందుకలా ? కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య 2019 ఎన్నికలు ముగిసినప్పటినుంచి అస్సలు పడడం లేదు. అనేకసార్లు అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నియోజకవర్గంలో ఇరువురి మధ్య ఆధిపత్యపోరు ముదిరి ఒక వర్గం పై మరో వర్గం దాడులు, హత్యాయత్నంల వరకు  దారితీశాయి .

పంచాయతీ పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో ఒక వర్గం పై మరో వర్గం పోటీ చేసి పార్టీ అభ్యర్థులు ఓడిపోయినా సందర్భాలు ఉన్నాయి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆర్థర్ ల మధ్య వర్గ పోరును నివారించేందుకు వైసిపి జిల్లా ఇన్చార్జి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి  చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. వారి మధ్య సయోధ్య సాధ్యం కాక పోగా తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనంతగా నందికొట్కూరు వైసీపీలో సమస్యలు రచ్చరచ్చగా మారి చర్చకు దారితీస్తున్నాయి. పరస్పరం కేసులు పెట్టుకోవడం పోలీస్ వర్గాలకు కూడా ఇబ్బందిగా మారుతున్న పరిస్థితి. అభివృద్ధి పనుల్లోనూ, అధికారులు రెండు వర్గాలను సమన్వయం చేయలేక సతమతమవుతున్నారట. చైర్మన్ హోదాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు మున్సిపాలిటీ లో  వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్ కు ఆహ్వానం లేదు. చివరకు ఎమ్మెల్యే పేరు కూడా శిలాఫలకంపై లేకపోవడంతో చర్చకు దారి తీసింది. అదే శిలాఫలకం లో మున్సిపల్ అధికారుల పేర్లు ఉన్నాయని ఈ అంశంపై ఆర్థర్ వర్గీయులు నిలదీశారు.

దీంతో అధికారుల పేర్లు కనిపించకుండా ఇటుకలు పెట్టి మూసివేశారు. అంతేకాదు ఈ గొడవ తమకేందుకని ప్రారంభోత్సవానికి కూడా రాలేదు అధికారులు. సిద్ధార్థ రెడ్డి మొదటినుంచి వైసీపీలో ఉన్నారు. ఆర్థర్ పోలీస్ అధికారిగా రిటైరై వైసీపీ లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. నందికొట్కూరు ఎస్.సి రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో సిద్ధార్థ రెడ్డికి చాన్స్ లేదు. ఆర్థర్ మాత్రం ఎమ్మెల్యే గా తన పని తానూ చేసుకు పోతానని అంటున్న అది సిద్ధార్థ రెడ్డి సహించలేకపోవడం, ఆర్థర్ రాజీ పడకపోవడంతో  సమస్యలు శృతిమించుతున్నాయటా. ఎవరికీ చేటు తెస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: