విదేశీ టూర్‌ నిరాకరణపై మమత ఫైర్‌!

N.Hari
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో రగిపోతున్నారు. ఆమె  తీవ్ర స్థాయిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణలు  గుప్పిస్తున్నారు. ఇటలీ టూర్‌కు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే... రోమ్‌లో జరిగే సర్వమత శాంతి సదస్సుకు హాజరు కావాల్సిందిగా మమత బెనర్జీకి ఆహ్వానం లభించింది. అందులో జర్మనీ ఛాన్సరల్, పోప్ ఫ్రాన్సిస్ సహా పలువురు పెద్దలు కూడా పాల్గొంటున్నారు. ఆ సదస్సుకు వెళ్లేందుకు ప్రోటోకాల్ ప్రకారం మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం అభ్యర్థించారు. మొత్తం 500 మంది నేతలు సర్వమత శాంతి సదస్సులో పాల్గొంటున్నట్లు మమత తన లేఖలో తెలిపారు. అయితే గోడకు కొట్టిన బంతిలా విదేశాంగ శాఖ నుంచి సమాధానం వచ్చింది మమతకు. అలాంటి సదస్సులకు హాజరయ్యే స్థాయి మమతకు లేదంటూ ఆమె అభ్యర్థనను తోసిపుచ్చారు.
అభ్యర్థనను తిరస్కరించిన వెంటనే మమతా  బెనర్జీ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తాను తలుచుకుంటే.. నరేంద్ర మోదీ సర్కారు తనను ఆపలేదని ఆమె అన్నారు. విదేశాలు తిరగాలని తనకు కోరిక లేదన్నారు. అందుకే ఆ ఆలోచనను విరమించుకుంటున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. అయితే హిందువుల మనోభావాలు, హిందువుల గౌరవంపై పెద్దఎత్తున ఉపన్యాసాలు ఇచ్చే  బీజేపీ సర్కారు.. హిందూ మహిళనైన తనను అవమానించిందంటూ ఆమె మండిపడ్డారు. కేవలం ఈర్ష్య, కుళ్లుతో తన రోమ్ టూర్‌కు అనుమతి ఇవ్వలేదనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ అన్నారు.
మమతా బెనర్జీ పనిలో పనిగాప్రధాని నరేంద్ర మోదీపై వాగ్బాణాలు సంధించారు. మోదీ అమెరికా పర్యటనపై ప్రశ్నలు వర్షం కురిపించారు. అసలు నరేంద్ర మోదీని అమెరికాలోకి ఎలా అనుమతించారు అన్నదిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ ప్రధాన ప్రశ్న. కొవిడ్ టీకాలో భాగంగా నరేంద్ర మోదీ కొవాగ్జిన్ డోస్‌ తీసుకున్నారనీ, డబ్యూటీవో గానీ, అమెరికా ప్రభుత్వం గానీ ఆ టీకాకు గుర్తింపు ఇవ్వలేదని చెప్పుకువచ్చారు. కొవాగ్జిన్ తీసుకున్న భారతీయులు ఎవరినీ అమెరికాలోకి అనుమతించనప్పుడు.. మోదీకి ఎలా రెడ్‌ కార్పెంట్‌ పరిచారనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ నిలదీశారు. అంతమంది దేశాధినేతలు మోదీతో ఎలా భేటీ  అయ్యారని ఆమె ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: