స్థానికబరిలో.. అన్నాడీఎంకే నేత కూతురు..

Chandrasekhar Reddy
తమిళనాడులో స్థానిక ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. నేడు పరిశీలన ముగుస్తుంది, 25న ఉపసంహరణ గడువు ముగుస్తుంది. రాష్ట్రంలో జిల్లాల విభజన కారణంగా కాంచీపురం, వేల్పూరు, చెంగల్పట్టు, తిరుపత్తూరు, రాణిపేట, విల్లుపురం, కాళ్ళకూర్చి, నెల్లై, తాన్ ఖాజీ జిల్లాలలో స్థానిక ఎన్నికలు నిర్వహణ వాయిదా పడింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు అక్టోబర్ 6, 9 తేదీలలో నిర్వహిస్తున్నారు. దానిప్రకారమే 15న ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అది నిన్నటితో ముగిసింది. అక్టోబర్ 12న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో 3067 స్థానాలకు ఎన్నిక జరుగనుంది. బరిలో అధికార పార్టీ సహా ఏడు పార్టీలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల మాదిరే అధికార డీఎంకే పార్టీ మిత్ర పక్షాలతో బరిలో దిగుతుంది. మిత్రపక్షాలతో డీఎంకే, కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సిపిఐ, ఇండియన్ నేషనల్ లీగ్, ఎంఎంకే, టివికే లు ఉన్నాయి. ఇక ప్రతిపక్షంలో అన్నాడీఎంకే, బీజేపీ, టీఎంసీ లు ఉన్నాయి. అలాగే డీఎండీకే, ఎంఎన్ఎం, ఎన్టికే లు స్వతంత్రంగా పోటీలో ఉన్నారు. అధికారపార్టీ సహా అన్నిటికి మిత్రపక్షాలు ఉన్నప్పటికీ నామినేషన్ల కు ముందే సీట్ల సర్దుబాటు చేసుకోవడంతో నామినేషన్ ప్రక్రియ అల్లర్లు లేకుండా ప్రశాంతంగా జరిగింది.
ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో అన్నాడీఎంకే నేత కూతురు బరిలో ఉండటం అందరిని ఆకర్షిస్తుంది. తన తండ్రికి సీటు దక్కకపోవడంతో  తానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ఆమె తెలిపారు. విద్యాపరంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ఐఏఎస్ శిక్షణ లో ఉన్నారు. అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. నిన్నటితో నామినేషన్ గడువు ముగుస్తుండటంతో ఆమె నిన్న ఒంటరిగా కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. 27 ఏళ్ళ జయప్రద కు ఇటీవలే వివాహం అయిన విషయం తెలిసిందే. అయినా కూడా ఒంటరిగా నామినేషన్ దాఖలుపై ఆసక్తి నెలకొంది. అయితే ఉపసంహరణ గడువు ఉండటంతో అప్పట్లోపు ఏమైనా జరగవచ్చు అంటున్నారు అధికారపక్షం వారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: