భర్త తేడా, కోడలికి గర్భం కోసం మామ ప్రయత్నం...!

Sahithya
మహారాష్ట్రలో స్వయం ప్రకటిత స్వామీజీ ఆదేశాల మేరకు ఒక మహిళను ఆమె మామగారు లైంగికంగా వేధించారు. అలాగే కోడి రక్తం కూడా తాగాలని వేధించారు. అలాగే శారీరకంగా కూడా ఆమెను వేధించారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది. మహిళ భర్త మరియు మామలను అరెస్టు చేసి, ఆమె అత్తగారిపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా తన కథనంలో ప్రస్తావించింది. 33 ఏళ్ల బాధితురాలు తన భర్త నపుంసకుడని, అత్తమామలు తన వద్ద దాచిపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసారు.
అతని అమ్మానాన్న తనను గర్భం దాల్చేలా తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త నపుంసకత్వం గురించి తెలుసుకున్నప్పుడు ఆమె తన బంధువులకు అసలు విషయం చెప్పింది. ఈ ఘటనపై భోసారి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర కదమ్ మీడియాతో మాట్లాడుతూ... అతను డిప్లొమా ఇంజనీర్ మరియు ఆమెకు బ్యాచిలర్ డిగ్రీ ఉంది అని తెలిపారు. వారు డిసెంబర్ 30, 2018లో వివాహం చేసుకున్న తర్వాత గత నాలుగు నెలలుగా విడివిడిగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తామని ఇద్దరినీ విచారిస్తామని పేర్కొన్నారు. 2018 నుండి తన అత్తమామలు తనను మానసికంగా మరియు శారీరకంగా హింసించారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద భోసారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. బ్లాక్ మ్యాజిక్ చట్టం, 2013 సెక్షన్ 3 తో పాటుగా పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసారు. ఈ ఘటన విషయంలో నిందితులను కఠినం గా శిక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన జాతీయ స్థాయిలో వైరల్ అయింది. సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి స్వామీజీలను నమ్మవద్దని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: