మహారాష్ట్రలో .. వింత వానలు

Chandrasekhar Reddy
అభివృద్ధి పేరుతో విపరీతమైన పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తుండటంతో ప్రపంచం లోనే కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తుంది. కేవలం ఈ కాలుష్యం కారణంగానే ప్రతి ఏటా ప్రపంచంలో 70 లక్షల మంది మృతి చెందుతున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నా కాలుష్య నివారణ కు మాత్రం ఆయా దేశాల ప్రయత్నాలు కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోతున్నాయి. దీనివలన వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఆమ్ల వర్షాలు పడుతున్నట్టు చూస్తూనే ఉన్నాం. చాలా దేశాలలో మంచు తీవ్రంగా కురుస్తూ మనిషికి మనుగడ లేకుండా చేస్తుంది.
ఇంకొన్ని చోట్ల రకరకాల రూపాలలో ప్రకృతి తన ప్రకోపాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉత్పాతాలు మానవ జీవనాన్ని స్తంభింప జేస్తూనే ఉన్నాయి. మనిషి చేసే ఈ తప్పులకు ఇప్పటికే అనేక ఇతర జీవరాసులు అంతరించిపోయాయి. ఇంకొన్ని అందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనితో మేలుకొన్న మనిషి కొన్ని అరుదైన జీవరాసులను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఎన్ని చేసినా కాలుష్య నివారణకు పూనుకోకపోతే అవన్నీ వృధానే అంటున్నారు నిపుణులు. ప్రకృతి సిద్ధంగా దొరికే స్వచ్ఛమైన గాలి, నీరు లాంటి ప్రాధమిక అవసరాలు కూడా ప్రస్తుతం కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితికి వచ్చేశాము.
అయినా సాధారణ మనిషి నుండి పెద్ద పెద్ద వ్యవస్థల వరకు ఎటు వంటి మార్పుకు చర్యలు తీసుకోకపోవడం ముందు తరాల వారికి తెలిసితెలిసి చేస్తున్న చేటు అని అందరూ గ్రహించాలని పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ వారు అనేక ప్రచారాలు కూడా చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా స్వచ్ఛమైన గాలి కోసం అల్లాడిపోవడాన్ని ప్రపంచం మొత్తం అనుభవించింది. తాజాగా భారత్ లోని మహారాష్ట్రలో కూడా ఒక వింత వాన పడింది. చూడటానికి కొత్తగా ఉండటంతో అందరు దానిని విచిత్రంగా చూశారు. ఆకాశం నుండి మేఘాలు విరిగిపడుతున్నాయా అన్నట్టు ఆ వానలు పడ్డాయట. అయితే వైజ్ఞానికులు మాత్రం అది మేఘాలు రాలిపోవడం కాదు, కాలుష్యం వలన పేరుకుపోయిన ధూళి కణాలు అలా రూపాంతరం చెంది వానతో సహా కిందకు వస్తున్నాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: