వామ్మో.. ఒకే స్కూల్లో 82 మందికి కరోనా?

praveen
కరోనా వైరస్ కారణంగా విద్యారంగం ఎంత కుదేలయిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాఫీగా సాగిపోతున్న విద్యార్థుల చదువులు అయోమయంలో పడిపోయాయ్. గొప్ప గొప్ప చదువులు చదివి ప్రయోజకులను కావాలి అనుకున్న ఎంతోమంది విద్యార్థులు కలలు సందిగ్ధంలో పడిపోయాయ్. అసలు తాము చదువుకోగలమా అనే అనుమానం అందరిలో పెరిగిపోయింది..  ఎందుకంటే కరోనా వైరస్ వచ్చిన నాటి మూతపడిన విద్యాసంస్థలు నేటికీ అన్ని రాష్ట్రాలలో కూడా పూర్తిస్థాయిలో తీర్చుకోలేదు అని చెప్పాలి.

 మొదటి దశ కరోనా వైరస్ ముగియగానే విద్యాసంస్థలను తెరవాలని ప్రయత్నించినప్పటికీ ఊహించనంత వేగంతో రెండవ దశ దూసుకురావడంతో అందరూ వెనుకడుగు వేయక తప్పలేదు. ఇక ఇప్పుడు రెండో దశ కరోనా వైరస్ దాదాపుగా అన్ని రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టింది.  మూడవ దశ కరోనా వైరస్ దూసుకు వస్తుంది అని చెబుతున్నప్పటికీ ఎక్కువగా ప్రభావం చూపదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి. దీంతో ఎన్నో రోజుల నుంచి ఇంటికే పరిమితమైన విద్యార్థులు ఇక ఇప్పుడు పాఠశాలలకు వెళుతున్నారు. కరోనా నిబంధనల మధ్య ప్రస్తుతం విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయని చెప్పాలి.

 ఇలా పకడ్బందీగా తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరోనా వైరస్ వ్యాపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలు కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ధరంపూర్ పాఠశాల లో కరోనా కలకలం రేపింది. ఇటీవలే పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ఉపాధ్యాయులు సహా ఏకంగా 79 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడం సంచలనం గా మారిపోయింది. దీంతో పాజిటివ్ వచ్చిన వీళ్లందరినీ కూడా క్వారంటైన్ కి తరలించారు  ఇక ఆ పాఠశాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. ఈనెల 25 వరకు రాష్ట్రంలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థుల చదువులు మరోసారి అయోమయంలో పడిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: