అమెరికాలో ప్ర‌ధాని మోడీకి ఘ‌న స్వాగ‌తం..

Paloji Vinay
చాలా రోజుల త‌రువాత ప్రధాని మోడీ విదేశి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అలాగే జో బైడెన్ అమెరికా అధ్య‌క్షుడు అయిన త‌రువాత మొద‌టి సారిగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్ చేర‌కున్న ప్ర‌ధాని మోడీకి ఘ‌న స్వాగతం ల‌భించింది. ఇండియన్‌-అమెరిక‌న్‌లు, అధికారులు ఆయ‌న‌కు వెల్‌క‌మ్ చెప్పారు. ఐదు రోజుల పాటు సాగ‌నున్న ఈ టూర్‌లో అమెరికాతో పాటు జపాన్‌, ఆస్ట్రేలియాల‌తో వ్యూహాత్మ‌క సంబంధాలు బ‌లోపేతం కానున్నాయి. బుధ‌వారం ఎయిర్ ఇండియా వ‌న్ విమానంలో బ‌య‌ల్దేరిన మోడీ వెంట జాతీయ భ‌ద్ర‌త స‌ల‌హాదారుడు అజిత్ దోవ‌ల్‌, విదేశీ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ శింగ్లా తో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారుల ఉన్నారు.

అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బయలుదేరే ముందు మోడీ  తన పర్యటన గురించి వివరాలను వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకే అక్కడికి వెళుతున్నానన్నారు. భార‌త్‌, అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి బైడెన్‌తో చర్చిస్తానని తెలిపారు మోడీ. '' సెప్టెంబరు 22–25 వరకు అమెరికా పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చ‌ర్చ‌లు జ‌రుగుతాయి.  జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని యొషిహిదె సుగాలతో కలిసి తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్న క్వాడ్‌ సదస్సులోనూ పాలు పంచుకుంటున్నాను. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భవిష్యత్‌ కార్యాచరణ, ప్రాధాన్యాలను గుర్తించడానికి  సదస్సు ఉపయోగ‌ప‌డుతుంది ''  అని  ప్రధాని నరేంద్ర న‌రేంద్ర మోడీ వెల్ల‌డించారు.

 నరేంద్ర మోడీ అమెరికా టూర్‌ షెడ్యూల్
  సెప్టెంబ‌ర్‌ 23న అమెరికాలోని వాషింగ్టన్‌లో మేజర్‌ కంపెనీల సీఈవోలతో మోడీ భేటీ అవుతారు.  క్వాల్‌కామ్, అడోబ్, ఫస్ట్‌ సోలార్, ఆటమిక్స్, బ్లాక్‌స్టోన్‌ కంపెనీల సీఈవోలతో చ‌ర్చ‌లు జ‌రుపుతారు.  అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో ముఖాముఖి చర్చలు ఉంటాయి.
  సెప్టెంబర్‌ 24న  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్‌హౌస్‌లో భేటీ అవుతారు. అఫ్గ‌న్‌లో నెల‌కొన్న‌ పరిణామాలు,  ఉగ్రవాదం, చైనా ఆధిపత్యం, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చ‌ర్చ‌లు జ‌రుపుతారు. అనంత‌రం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోనూ మోడీ స‌మావేశం అవుతారు.
అదే రోజు జపాన్‌ ప్రధాని యోషిహిడో సుగాతో విడిగా బేటీ అవుతారు మోడీ.  అనంతరం అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్‌ దేశాలతో కూడి న క్వాడ్‌ సదస్సులో మాట్లాడుతారు. ఆ సమావేశం ముగిసిన అనంత‌రం న్యూయార్క్‌ వెళతారు  ప్రధాని మోదీ.
సెప్టెంబరు 25న జ‌రిగే ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సమావేశంలో పాల్గొంటారు.  అదే రోజు భారత్‌కు తిరుగు ప‌య‌న‌మ‌యి.. సెప్టెంబర్‌ 26న  ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటారు దీంతో అమెరికా ప‌ర్య‌ట‌న ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: