ఎందుకని? ఏమిటని? : జగన్ కు భయం! రేవంత్ కు నిర్భయం!!

RATNA KISHORE

ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు నేత‌లు ఒక‌రు కేంద్రంతో అదే ప‌నిగా పోరాడుతున్నారు. మ‌రొక‌రు కేంద్రానికి అదే ప‌నిగా భ‌జ‌న చేయించే ప‌నికి కొంద‌రు మ‌నుషుల‌ను నియ‌మించి, సంబంధిత కార్యాన్ని నిరాటంకంగా జ‌రిగేలా చూస్తున్నారు. ఒకరిది మ‌నుగ‌డ పోరాటం.. మ‌రొక‌రిది ఆస్తుల కోసం ఆరాటం.. ఈ పోరాటం ఆ ఆరాటం అన్న‌వి రెండూ రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెంది న‌వే కావ‌డం.. ఆ రెండూ ఒకే సామాజిక‌వ‌ర్గంకు చెందిన నేత‌లే చేస్తుండ‌డం విశేష‌మ్. అలా అని రేవంత్ గొప్ప వీరుడు అని చెప్ప కూడ‌దు..అదేవిధంగా జ‌గ‌న్ లో భ‌యం ఇక ఎప్ప‌టికీ తొల‌గిపోద‌నీ చెప్ప‌లేం. అవును! దారులు వేరు, గ‌మ్యం అధికారం.. కానీ ఇద్ద‌రికీ ప్ర‌జ‌లంటే ప్రేమేనా? ఏమో! కాలం చెప్పాలి చెబుతుంది కూడా!

జ‌గ‌న్ కేసుల‌కు భ‌యం ఉంది. రేవంత్ కు లేదు. అవును! ఇది నిజం! అయితే రేవంత్ కు కూడా భ‌యం ఉంది కానీ అది పైకి క‌ని పించ‌నివ్వ‌డు. ఆ భ‌యం త‌న‌కు తాను తెచ్చుకుంది కాదు కొన్ని కార‌ణాల రీత్యా తెచ్చిపెట్టుకున్న‌ది. అందుకే ఆ రోజు సోనియా ను ఎదురించిన జ‌గ‌న్ త‌రువాత కాలంలో సైలెంట్ అయిపోయినా, రేవంత్ మాత్రం అస్స‌లు వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. వైట్ ఛాలెంజ్ విసిరి కేటీఆర్ ను మ‌ళ్లీ ముచ్చెమ‌ట‌లు పోయించాడు. కానీ జ‌గ‌న్ అలా కాదు ఆరోజు చేసిన పోరాటం, నిర్భీతిగా సోనియాను ఢీ కొన్న వైనం అన్నీ మ‌రిచిపోయి, కేంద్రం ద‌గ్గ‌ర స‌రెండ‌ర్ అయిపోయారు. ఆవిధంగా జ‌గ‌న్ లో సాహసం అనే గుణం గంగ‌లో క‌లిసి పోయింది.

అంత పెద్ద స‌ముద్రంలాంటి కాంగ్రెస్ కు ఎదురెళ్లి చేసిన ప్రయాణం మ‌రిచిపోయి, మా వెనుక జ‌నం ఉన్నారు అన్న విష‌యం చెప్ప డం మ‌రిచిపోయి జ‌గ‌న్ నానా అవ‌స్థ‌లూ ప‌డుతున్నారు. మ‌రిచిపోయి కాదు అనుకోండి చెప్ప‌డం వెనుక కావాల్సినంత ధైర్యం ఇ ప్పుడు లేదు క‌నుక! జ‌గ‌న్ ఒక్క విష‌యంలో సక్సెస్ అయ్యారు ప్ర‌జావేదిక కూల్చివేయడంలో! మ‌రో విష‌యంలో ఇంకా స‌క్సెస్ అయ్యారు అన్న క్యాంటీన్ల నిలుప‌ద‌ల‌లో! ఇవి మిన‌హా ఆయ‌న కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట‌ల‌పై ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించ‌లేక‌పోయా రు. ఆ మాట‌కు వ‌స్తే ఆయ‌న బాబుపై పైచేయి సాధించిన ఉదాహ‌ర‌ణ‌లే త‌క్కువ. వేళ్ల‌మీద లెక్క‌పెట్ట‌వ‌చ్చు. ఇదే స‌మ‌యంలో అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన రేవంత్ రెడ్డి జోష్ పెంచుకుంటూ పోతున్నారు.

సముద్రాన్నే నేను న‌డిపిస్తున్నా అన్న ఫీలింగ్ తో ఆయ‌న స్పీచులు దండీగా దంచికొడుతున్నారు. దీంతో బోణీలే లేని కాంగ్రెస్ కు ఊపు వ‌చ్చింది. ఉత్సాహం వ‌చ్చింది. నోరేసుకు ప‌డిపోవ‌డం ఎలానో చాలా రోజుల‌కు తెలిసి వ‌చ్చింది. క్యాస్ట్ కార్డు పోలిటిక్స్ ఎలా చేయాలో మ‌రో సారి తెలిసి వ‌చ్చింది. ఇన్ని తెలియ‌జెప్పిన రేవంత్ రెడ్డి రేపు సీఎం కాక‌పోయినా కొన్ని కేసుల‌లో ఇరుక్కుని జైళ్ల చుట్టూ తిరిగినా  జ‌గ‌న్ క‌న్నా  బాగానే నెగ్గుకు వ‌స్తున్నాడ‌న్న పేరు మాత్రం త‌ప్ప‌క తెచ్చుకున్నాడు. దానిని నిలుపుకుంటాడో లేదో అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి. నిర్ణ‌యిస్తుందా?

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: