దేవుడా!: ధ‌ర్నా చౌక్..రేవంత్ అడ్డా అయ్యిందే!

RATNA KISHORE
మహా ధ‌ర్నా పేరిట ఇవాళ ధ‌ర్నా చౌక్ ద‌ద్ద‌రిల్లిపోయింది. దీంతో గులాబీ ద‌ళం అదిరిప‌డింది. అవును! ఇవే రొటీన్ గా రాయాలి. అవును ఇంత‌కుమించి రేవంత్ లాంటి ఉద్య‌మ‌కారుల నుంచి ఆశించేదేమీ ఉండ‌దు అనుకోండి. అది వేరే విష‌యం. మ‌రి! ఆ రోజు ఓయూ ద‌గ్గ‌ర‌కు మీరు ఎన్ని సార్లు వెళ్లారు. మీకు వ‌రంగ‌ల్ కాక‌తీయ‌కు వెళ్లే స‌మ‌యం ఆ రోజు చిక్క‌లేదు క‌దూ! ఎనీవే మీరు పోరాటం చేయండి కాద‌నం కానీ జ‌నాల‌ను ఆ పేరుతోనో మ‌రో పేరుతో జ‌నాల‌ను వంచించ‌కండి. అదే సిస‌లు దౌర్భాగ్యం కాగ‌ల‌దు.

చాలా రోజుల‌కు అస‌లు సిస‌లు ధ‌ర్నా ఒక‌టి ధ‌ర్నా చౌక్ లో జ‌రిగింది.ఈ విధంగా జ‌ర‌గ‌డంతో చాలా మంది ఆనందంగా ఉన్నారు. కేసీఆర్ ను తిట్టేవారు, కేసీఆర్ అంటే గిట్ట‌ని వారు. వారి దారి ఎలా ఉన్నా రేవంత్ మాత్రం భ‌లే ఖుషీగా ఉన్నాడు. ఆయ‌న సాధిం చాలనుకున్న‌ది ఇదే! అస‌లు ఆయ‌నేం సాధించాల‌నుకుంటున్నాడో అస్స‌లు అంతు చిక్క‌డం లేదు. తెలంగాణ సీఎం అయిపోవా లని క‌ల కంటే అది జ‌ర‌గ‌ని ప‌ని. మ‌రి! ఇంకేం కావాల‌నుకుంటున్నాడు?

 ఏమో! కాంగ్రెస్ సీనియర్ల‌ను ఎందుక‌ని త‌క్కువ అంచ‌నావేస్తున్నాడో రేవంత్. వైఎస్స్ కే చుక్క‌లు చూపిన బ్యాచ్ అక్క‌డ ఉంది రేవంత్ జాగ్ర‌త్త‌గా! ఉండాలి నీవు. ప‌దవుల క‌న్నా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఎన్నో ముళ్లు దాటిన వైఎస్స్ సీఎం అయ్యా రు. ఇంకా కొన్ని స‌వాళ్లు దాటాక జ‌గ‌న్ సీఎం అయ్యాడు. మంచో చెడో పూర్తి స్థాయిలో నీకు ఏమీ అర్థం కావ‌డం లేదు క‌నుక మా కు ఎంతో సంతోషం. కానీ ఇంటి పార్టీ కేసీఆర్ ను అంత వేగంగా నీవు అనుకున్నంత సులువుగా వ‌దులుకోలేరు తెలంగాణ‌లో! ఒ ప్పుకుంటాం ఆయ‌న త‌ప్పులు చేస్తున్నార‌ని.. వాటిని మించిన త‌ప్పులు మీరూ చేస్తున్నారు. ముందు అవి కూడా ఆలోచించుకు ని ప్ర‌జ‌ల‌కు ఓ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌ గండి.
ఇంకా చెప్పాలంటే....... :
ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొర‌ల పాలైంద‌ని బాధ‌ప‌డ్డారు రేవంత్. ఆ బాధ‌లో అఖిల ప‌క్షం భాగం అయింది. ఆశ్చ‌ర్యం! అంతా క‌లిసి ఒకే వేదికపై ఉన్నారు. వారిలో కోదండ రామ్, మ‌ధు యాస‌కీ, సీపీఐ నారాయ‌ణ, సీపీఎం ఏచూరీ ఇలా అంతా ఉన్నా రు. ఇప్పుడు ఉద్య‌మంలో ఉరికిన వాళ్లు రేవంత్ ను నిందించ‌డం మాని, అస్స‌లు ఆ రోజు ఆచూకీ లేకుండా పోయిన రేవంత్ ను త‌మ హీరోగా ప్ర‌క‌టించుకున్నారు. ఇది క‌దా! అఖిల ప‌క్షం సాధించిన విజ‌యం. ఇదే సిస‌లు విజ‌యం. ఇక కేసీఆర్ ను గ‌ద్దె దించ డం అన్న‌ది చాలా సులువు? అని అనుకోండి ఏం కాదు? అలా అనుకోవ‌డంతోనే జీవితం గడిచిపోతే చాలు ఇంకేం వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: