భరత్‌ని బుక్ చేస్తున్నారా?

M N Amaleswara rao
గత నాలుగు రోజుల నుంచి రాజమండ్రి రాజకీయాలు రంజుగా మారాయి...అధికార వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలకు అసలు పొసగడం లేదు. వారి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీరికి పెద్దగా పడటం లేదని తెలిసింది. కానీ అప్పుడు అంతర్గతంగా వారి మధ్య వార్ జరిగింది. కానీ ఇప్పుడు పూర్తిగా బయటపడిపోయింది.
అది కూడా భరత్ రాజకీయంతోనే అని తెలుస్తోంది. ఇటీవల రాజా నియోజకవర్గమైన రాజానగరంలో ఒక దళిత లెక్చరర్‌పై దాడి జరిగింది. ఇక తనపై దాడి చేసింది...ఎమ్మెల్యే రాజా అనుచరులు అని లెక్చరర్ ఆరోపించారు. ఇదే సమయంలో భరత్...రాజానగరం వెళ్ళి ఆ లెక్చరర్‌ని పరామర్శించారు. అలాగే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులుని ఆదేశించారు.
ఆ తర్వాత రాజా మీడియా ముందుకొచ్చి...భరత్ పార్టీని నాశనం చేస్తున్నారని, టి‌డి‌పి నేతలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అటు భరత్ కూడా కౌంటర్‌గా మీడియా సమావేశం పెట్టి మరీ..రాజాపై ఫైర్ అయ్యారు. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో తెలుసని మాట్లాడారు. అలాగే రాజాలాగా కిడ్‌ని కాదని సెటైర్ వేశారు. తాను పార్టీ లైన్ గీత ఎప్పుడు దాటలేదని మాట్లాడారు. ఇలా ఇద్దరు నాయకుల మధ్య రచ్చ జరిగింది. ఈ రచ్చలోకి రఘురామకృష్ణం రాజు ఎంట్రీ ఇచ్చారు. ఈయన పరోక్షంగా రాజాకు సపోర్ట్‌గా మాట్లాడుతూ...భరత్‌పై ఆరోపణలు గుప్పించారు.


ఆవ భూముల్లో భరత్ అక్రమాలు చేశారని, ముందస్తు చెక్కులు కూడా తీసుకున్నారని గతంలోనే రాజా ఆరోపించారని అయినా సరే భరత్‌పై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే అక్రమాలు చేశారు కాబట్టే రెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారా? అని ప్రశ్నించారు. అలా అయితే రెండు రాష్ట్రాల బాధ్యత కూడా ఇచ్చేయండి అంటూ రఘురామ సెటైర్ వేశారు. అంటే పరోక్షంగా భరత్‌ని బుక్ చేసేలా రఘురామ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: