వైఎస్ భ‌క్తుడికి పదవి? గండంలో ఆర్టీసీ!

RATNA KISHORE
వైఎస్ భ‌క్తుడిగా పేరున్న బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్ రెడ్డికి ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు కేసీఆర్. అంతేకాదు స‌మ‌ర్థుడైన ఐపీఎస్ అధికారి స‌జ్జ‌నార్ ను ఎండీగా నియ‌మించారు కూడా! అయినా ఆర్టీసీని స‌మ‌స్య‌ల గ్ర‌హణాలు వీడ‌డం లేదు. అనుకూల వాతావ‌ర‌ణం ఏదీ కనిపించ‌డం లేదు. అలాంట‌ప్పుడు ఆర్టీసీని త‌మ వ‌ద్ద ఉంచుకుని ఏం చేయాల‌ని కేసీఆర్ ప్ర‌శ్న. ఇంకేం ప్ర‌యివేటు బాటే శ‌రణ్యం.చేస్తారా? లేదా ఉద్యోగుల‌పై క‌రుణ చూపి మ‌రికొన్ని నిధులు ఇచ్చి సంస్థ‌ను ఆదుకుంటారా?

క‌రోనా కార‌ణంగా కొంత‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగి ఇంకొంత సంస్థ న‌ష్టాల్లో ఉంది. ఏటా మూడు వేల  కోట్ల రూపాయ‌ల సాయం చేసినా కూడా సంస్థ బాగుప‌డ‌డం లేదు. ఇలా అయితే సంస్థ‌ను నిర్వ‌హించ‌లేం. ఎంత‌కాలం అని ఆర్థిక భారం మోయ‌గ‌లం. మీరే చెప్పండి.ఛార్జీలు  పెంచ‌డం మిన‌హా మ‌రో దారి లేదు. ఇది కాకుండా ఏమ‌యినా దారి ఉందా? వెత‌కండి? - కేసీఆర్
సుదీర్ఘ కాలం త‌రువాత ఆర్టీసీ సంస్థ కు మంచి నాయ‌కులు వ‌చ్చార‌న్న ఆనందం కొద్దిసేపు కూడా లేదు కార్మికుల‌కు. గ్రేట‌ర్ హైద్రాబాద్ మొద‌లుకుని  అన్ని జిల్లాల్లోనూ ఆ దాయం ఇచ్చే  స‌ర్వీసులే లేవ‌ని తేలిపోయింది. దీంతో స‌మ్మె స‌మ‌యంలో చెప్పిన మాట‌లే మ‌ళ్లీ చెబుతున్నారు కేసీఆర్. ఈ సారి ప్ర‌యివేటు బాట ప‌డితే ఆర్టీసీ కార్మికు లు రోడ్డున ప‌డాల్సిందే. లేదా సంస్థ ఆస్తులు అమ్మి అప్పులు తీర్చి, ఒడ్డున ప‌డాల్సిందే. ఇవ‌న్నీ కేసీఆర్ చూపిస్తున్న దారులు. మ‌రి! అధికారులు ఏంచేస్తున్నారు. ప్ర‌జా ర‌వా ణా వ్య‌వ‌స్థ‌ను ప్ర‌యివేటు సంస్థ‌లు కూడా మోయ‌లేని భారంగానే ఉన్నాయి. అందుకు హైద్రాబాద్ మెట్రోనే పెద్ద ఉదాహ‌ర‌ణ. ఆ సంస్థ‌కు వెయ్యి కోట్లు ఇవ్వ‌డానికే కేసీఆర్ వంద ఆలోచన‌లు చేస్తున్నారు కానీ ఇవ్వ‌డం లేదు. అలాంటిది పెద్దాయ‌న పెద్ద మ‌న‌సుతో ఇప్ప‌టికే చాలా సార్లు ఆదుకున్నారు. ఇక సంస్థ భ‌విష్య‌త్ కార్మికుల‌ది. ఉన్నతా ధికారుల‌ది..అని కొంద‌రు గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆర్టీసీ ఎలా ఉన్నా న‌డిచిపోయింది. విడిపోయాక ఉద్యోగుల‌ను త‌న ప్ర‌భుత్వ ప‌రిధిలోకి  తీసుకుని, సంస్థ‌ను ప్ర‌భుత్వ ప‌రం చేశారు జ‌గ‌న్. ప్ర‌యివేటు ప‌రం చేస్తాను అంటున్నాడు కేసీఆర్. ఎవ‌రు గొప్ప‌?

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: