శ్రీ‌కాకుళం వార్త : మంత్రి సీదిరి పై ఏఓబీ బాధ్య‌త‌?

RATNA KISHORE

చిన్న వ‌య‌సులోనే మంత్రి అయిన సీదిరికి అతి పెద్ద బాధ్య‌తే నెత్తిన ప‌డింది. ఎన్న‌డూ లేని విధంగా ఒడిశా వినిపిస్తున్న స‌రిహ‌ద్దు రాజ‌కీయాలకు ప‌రిష్క‌ర్త‌గా సీదిరి ఉన్నారు. ఈ వివాదంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చొర‌వ అయితే  పూర్తి స్థాయిలో లేదు  అన్న వాద‌నొక‌టి వినిపిస్తోంది. స‌రిహ‌ద్దు వివాదంపై జ‌గ‌న్ మాట్లాడితేనే బాగుంటుంది అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తుంది. పొరుగు  సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో ఆయ‌నెందుకు మాట్లాడ‌రు అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు స‌రిహ‌ద్దుకు చెందిన ఆంధ్రా ప్రాంత వాసులు.

హ‌క్కుల విష‌య‌మై ఇప్ప‌టికే ఒడిశాదే పై చేయి అవుతోంది. 
నీళ్లు విష‌య‌మై త‌న ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా భూ త‌గాదాల్లో మొండి ప‌ట్టుకు పోయి విష‌యం సుప్రీం కోర్టు దాకా లాగేలా ఉంది. అనుభ‌వం త‌క్కువ ఉన్న మంత్రి ప్ర‌స్తుతం ఆవేశంతో నెగ్గుకు వ‌స్తున్నా సౌమ్య గుణం ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు లాంటి నేత‌లే వీటిని ప‌రిష్క‌రించ‌గ‌ల‌రు అన్న న‌మ్మ‌కం ఒక‌టి వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న‌ది.ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దు వివాదాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రఫున గొంతు వినిపిస్తున్న మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుపై కీల‌క బాధ్య‌త ఉం ది. ఒక‌వేళ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగి ఆయ‌న ఉంటారా లేదా అన్న‌ది ఎలా ఉన్నా ఇక్క‌డి స‌మ‌స్య పై మాట్లాడాల్సిన నేత ఆయ‌నొక్క రే. ఎందుకంటే వివాదం అంతా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి అంటే ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనే జ‌రుగుతోంది. మంత్రి సీదిరి కూ డా చాలా సీరియ‌స్ గానే ఉన్నారు. అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతున్నారు. ప్ర‌భావిత ప్రాంతం అయిన మంద‌స మండ లం, మాణిక్య ప‌ట్నం చేరుకుని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌తోనూ మ‌మేకం అవుతున్నారు. ఇక్క‌డి గిరిజ‌నుల‌పై ఒడిశా జులుం ప్ర‌ద‌ర్శి స్తుంద‌ని, కేవ‌లం ప్ర‌కృతి వన‌రుల‌పై ఉన్న ప్రేమ కార‌ణంగానే ఈ ప్రాంతం పై క‌న్నేసింద‌ని సీదిరి అంటున్నారు. ఒక్క అంగుళం భూ మిని కూడా వ‌దులుకోమ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. 1959 -60 రికార్డుల ప్ర‌కారం మాణిక్య ప‌ట్నం అన్న‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే ఉంద‌ని చెబుతున్నారు. నిన్న‌టి వేళ మందస మండ‌లంలో జ‌రిగిన మ‌జ్జి తుల‌సీదాసు (సీనియ‌ర్ నేత‌)  సంస్మ‌ర‌ణ స‌భ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తాజా వివాదంపై ఆయ‌న మాట్లాడారు. అయితే సీదిరి అప్ప‌ల రాజు వాద‌న ఇలా ఉంటే ఒడిశా మాత్రం మ‌రో విధంగా అంటోంది. ఈ భూమి మ‌దేనని, తాము ఇందుకు సంబంధించి న్యాయ‌పోరాటానికి సైతం సిద్ధ‌మేనని చెబుతోంది. దీంతో రెండు ప్ర‌భుత్వాలు మాట్లాడుకోవాల్సింది పోయి ప‌ర‌స్ప‌రం కేసులు న‌మోదు చేసుకునేదాకా వివాదాన్ని తీసుకువెళ్తున్నారు. ఒడిశా బీజేపీ మ‌న అధికారుల‌ను బెదిరించిన ఆంధ్రా మంత్రి సీదిరిపై ఎందుకు క్రిమినల్ చ‌ర్య‌లు తీసుకోరు అని ప్ర‌శ్నిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: