శ్రీ‌కాకుళం వార్త : టీడీపీ ఎత్తుగ‌డ ఫ‌లించ‌లే !

RATNA KISHORE

శ్రీ‌కాకుళం న‌గ‌ర కార్పొరేష‌న్ కు సంబంధించి ప్ర‌ధాన స‌మ‌స్య ఒక‌టి తొల‌గిపోయింది. శివారు పంచాయ‌తీల విలీనంపై స్ప‌ష్ట‌త రా వ‌డంతో ప్ర‌క్రియ కూడా వేగ‌వంతం అవు తోంది. ఇక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి న్యాయ‌ప‌ర‌మైన కొర్రీలు కొన్ని టీడీపీ వేస్తోం ది. ఇవి కూడా వైసీపీ క్లియ‌ర్ చేసేందుకు స‌న్న‌ద్ధం అవుతోంది.



శ్రీ‌కాకుళం న‌గ‌ర కార్పొరేష‌న్ కు సంబంధించిన రాజ‌కీయాలు మ‌రో మ‌లుపు తీసుకున్నాయి. ఎప్ప‌టినుంచో పుర‌పాల‌క స్థాయి నుంచి న‌గ‌ర పాల‌క స్థాయికి తీసుకు రావా ల‌న్న త‌లంపు ఒక‌టి పాల‌కులు చేస్తున్నారు. వైఎస్సార్ హ‌యాంలోనే ఈ ప్ర‌తిపాద‌న ఉంది. ఆ త‌రువాత కొన్ని శివారు పంచాయ‌తీల విలీనం అయితేనే, న‌గ‌ర పాల‌క సంస్థ‌ కు అనుగుణంగా జ‌నాభా ఉంటుందని, ల‌క్ష జ‌నాభా దాట‌నిదే కార్పొరేష‌న్ ఏర్పాటు సాధ్యం కాద‌ని తేల్చేశారు. అప్ప‌టి మంత్రి ధ‌ర్మాన విలీన పంచాయ‌తీల ప్ర‌తిపాద‌న ఒక‌టి తెర‌పైకి తెచ్చారు. పంచాయతీల విలీనం కాకుండా ఎన్నిక‌ల‌కు పోయేందుకు వీల్లేదు. దీంతో ఇక్క‌డ ఎన్నిక‌లు ప‌దేళ్లుగా లేవు. ప్ర‌త్యేక అధికారి పాల‌న‌లోనే సాగుతుంది వ్య‌వ‌హారం అంతా! నిన్న‌టి దాకా మున్సిప‌ల్ కౌన్సిల్ లేనందున జేసీ ప్ర‌త్యేక అధికారిగా ఉండేవారు. త‌రువాత కార్పొరేష‌న్ హోదా ద‌క్కాక కలెక్ట‌ర్ ప్ర‌త్యేక  అధికారిగా పాల‌న చేస్తున్నారు. పాల‌న అంతా ప్ర‌త్యేక అధికారి క‌నుస‌న్న‌ల్లోనే ఉంటుంది కానీ అభివృద్ధి మాత్రం లేదు. పంచాయ‌తీల విలీనం ఇప్పుడిప్పుడే మొద‌లైంది. మొద‌ట  అనుకున్న ఏడు పంచాయ‌తీల విలీనానికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ అమ‌ల‌వుతోంది.




పెద్ద‌పాడు, చాపురం, పాత్రుని వ‌ల‌స, ఖాజీపేట, కుశాల‌పురం, కిల్లిపాలెం, తోట‌పాలెం పంచాయ‌తీల‌ను విలీనం చేయాల‌న్న ప్ర‌తిపాద‌న తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో కొన్ని పంచాయ‌తీలు కోర్టును ఆశ్ర‌యించాయి. ఇందులో టీడీపీ హ‌యాంలో న‌డిచిన పంచాయ‌తీలు ఉన్నాయి. ఇవ‌న్నీ కోర్టులో అభ్యంత‌రాలు వెల్ల‌డిచేస్తూ విలీనాన్ని అడ్డుకున్నా యి. అయితే వీరి అభ్యంత‌రాలు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని చెబుతున్నాయే కానీ విలీనంపై ఎటువంటి మాటా అడ్డుప‌డ‌డం లేద‌ని వైసీపీ చెబుతోంది. దీంతో విలీనంకు సం బంధించి మొద‌ట్లో ఉన్న అడ్డంకులు ఇప్పుడు లేకుండాపోయాయి. ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ ఇవ్వ‌డంతో విలీనానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త వ‌చ్చింది. దీంతో ప్ర‌క్రియ కాస్త వేగం అయింది. ఇక ఎన్నిక‌లకు సంబంధించి కొన్ని అడ్డుంకులు ఉన్నాయ‌ని తెలుస్తోంది. కానీ ఇవి ఎప్పుడు ప‌రిష్కారం అవుతాయి అన్న‌ది స్ప‌ష్ట‌త లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: