వైజాగ్ క్రైం : వాడిని ఏం చేద్దాం జ‌గ‌న్?

RATNA KISHORE

నేరాలు నియంత్ర‌ణ‌లో ఉన్నాయి అని ఎప్పుడూ ఎక్క‌డా ఇక‌పై చెప్ప‌డం మానుకోండి స‌ర్. ఇప్పుడు నేరం సీలేరు వైసీపీ అధ్య‌క్షుడిది. ఏం చేస్తారు? ఇప్పుడీ స‌మ‌స్య‌ను ఎవ‌రు ప‌రిష్క‌రిస్తారు అన్న‌ది తేల‌డం లేదు తెలియ‌డం లేదు. అభాగ్యురాలి క‌న్నీరు తుడ‌వండి ప్లీజ్ జ‌గ‌న్ 




భ‌గ‌వంతుడు క్ష‌మిస్తాడో లేదో : 

దేవుడి పాల‌న‌లో  ఏవో కొన్ని మాన‌వ మృగాలు ఉంటాయి. ఉంటాయి క‌నుక త‌ప్పుకు తిర‌గాలి. దేవుడి పాల‌న‌లో ఏవో కొన్ని  చెడ్డ ద‌య్యాలు ఉంటాయి. ఉంటాయి క‌నుక త‌ప్పుకు తిర‌గాలి. దేవుడి పాల‌న లో జ‌రిగే మంచి, జ‌రిగే చెడు వీటిపై ఎవ్వ‌ర‌యినా ప్ర‌శ్నించ‌గ‌ల‌రా? ఏమో! ఇప్పుడు నిందితుడు సొంత పార్టీ మ‌నిషి. వైసీపీ మ‌నిషి. ఏం జ‌రుగుతుందో అన్న సంశ‌యం అయితే లేదు. త‌ప్ప‌కుండా బెయిల్ పై నిందితుడు వ‌స్తాడు. లేదా మ‌రో అడ్డ‌దారిలో త‌ప్ప‌క త‌ప్పించుకుని పోతాడు. ఇవ‌న్నీ మ‌నుషులం అయిన, లేదా ఓట‌ర్ల‌యిన వారంతా చూసి  చూడ‌క పోతేనే మేలు. భ‌గ‌వంతుడు క్ష‌మిస్తాడో లేదో కానీ ఆ ఆడ‌బిడ్డ‌కు న్యాయం చేసేది మాత్రం ఎవ్వ‌రు?



నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు...త‌రువాత‌? : 
అత్యాచారాల‌ను అరిక‌డుతున్నాం. మేం ప్ర‌జ‌ల‌కు ఆడ‌బిడ్డ‌ల‌కు అండ‌గా ఉంటున్నాం. వారి భ‌ద్ర‌తే మ‌న‌కు ముఖ్యం. దిశ చ‌ట్టం కూడా అందుకే. దేవుడి ద‌య‌వ‌ల్ల మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చింది..అని చెబుతారు జ‌గ‌న్. ఎంత ఘోరం అంటే సాక్షాత్తూ సొంత పార్టీ మ‌నుషులే అత్యాచారానికి, అత్యాచార రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుంటే చ‌ర్య‌లు తీసుకోలేక‌పోతున్నారు. తాజా ఘ‌ట‌న విశాఖ‌లో జ‌రిగింది. సీలేరు వైసీపీ అధ్య‌క్షుడు వెంక‌ట్రావు మాన‌వ‌త్వం మ‌రిచి, ఓ దివ్యాంగురాలిపై ఓ అస‌హాయురాలిపై అత్యాచారం చేసిన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఇప్పుడేం చేస్తారు జ‌గ‌న్. పాపం ఆ బాధితురాలికి మాట‌లు రావు. ఏం చెబుతుంది? ఏం చేస్తుంది? పోలీసు స్టేష‌న‌కు పోయాక న్యాయం జ‌రుగుతుంద‌ని గ్యారంటీ ఏమ‌యినా ఉందా స‌ర్? ప్ర‌స్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు...త‌రువాత‌?


మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: