బిగ్ బ్రేకింగ్: సంచలన ప్రకటన చేసిన జగన్...!

Gullapally Rajesh
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళడానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. సిఎం వైఎస్ జగన్ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఏదోక కార్యక్రమాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు కూడా ప్రజలతో ఎప్పటికప్పుడు మాట్లాడాలి అనే ఆదేశాలు ఇస్తున్నారు. నేడు సిఎం జగన్ స్పందనపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలి అని ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్‌ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తా అని ప్రకటించారు.
ప్రతి పర్యటనలో కూడా నేను సచివాలయాల సందర్శన తప్పనిసరిగా చేస్తాను అని తెలిపారు ఆయన. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చేస్తున్న సమయంలో ఏయే అంశాలపై దృష్టిపెట్టాలో మార్గదర్శకాలు కూడా ఇచ్చాం అని అన్నారు. ప్రతినెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబరు 24, 25 తేదీల్లో సిటిజన్‌ అవుట్‌రీజ్‌ కార్యక్రమం ఉంటుందని వివరించ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, ముఖ్యమైన ఫోన్‌ నంబర్లతో కూడిన పాంప్లెట్లను పౌరులకు అందించాలి అని ఆయన సూచించారు.
విజయదశమి రోజున ఆసరా పథకం అమలు చేస్తామని తెలిపారు. అక్టోబరు 7 నుంచి 10 రోజలుపాటు ఆసరా పథకంపై అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం ‘‘క్లాప్‌’’ అక్టోబరు 1న ప్రారంభిస్తామని అన్నారు. అక్టోబరు 19న జగనన్న తోడు కార్యక్రమం నిర్వహిస్తామని దీనికింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. అక్టోబరు 26న రైతులకు ‘‘వైయస్సార్‌ సున్నావడ్డీ రుణాలు’’ కార్యక్రమం ప్రారంభిస్తామని వివరించారు. దీంతో పాటు ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత అమలు చేస్తామని పేర్కొన్నారు. సిఎం జగన్ ప్రజల్లోకి రావాలని నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనం అయింది. ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: