శ్రీ‌కాకుళం వార్త : మోడీ బియ్యంకు జ‌గ‌న్ అడ్డు?

RATNA KISHORE
బియ్యం పంపిణీ కి సంబంధించి కేంద్రం, రాష్ట్రం ఏమ‌యినా కొట్టుకుంటున్నాయా లేదా స‌ర్వ‌ర్ మొరాయింపు అన్న‌ది డ్రామానా? 


ఒక‌వేళ  బియ్యం పంపిణీ  చేయ‌క వాటినేమైనా అమ్ముకుంటున్నారా ? ప‌క్క‌దోవ ప‌ట్టించి ప‌బ్బం గ‌డుపుకుంటున్నారా? శ్రీ‌కాకు ళం జిల్లాలో  ఎనిమిది ల‌క్ష‌ల‌కు పైగా ల‌బ్ధిదారులు ఉంటే పేద‌ల‌కు అందాల్సిన బియ్యం అందించక ల‌క్ష మందికి పైగా వీటిని చేర‌వే సి మిగ‌తా వారికి చుక్క‌లు చూపిస్తున్నారు. మూడు నెల‌లుగా స‌ర్వ‌ర్ ప‌నిచేయ‌క‌పోవ‌డంపైనే అనుమానాలు వెల్ల‌డి అవుతు న్నాయి. బ‌హుశా! కేంద్రం ఇచ్చిన బియ్యాన్నే సంచార వాహ‌నాల ద్వారా పంపిణీ చేసి ఇది తమ గొప్పే అని జ‌గ‌న్ చెప్పుకుంటు న్నారా అన్న అనుమానం కూడా విప‌క్షం చేస్తోంది.


గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న పేరిట బియ్యం ఇవ్వాల‌న్న‌ది కేంద్రం యోచ‌న‌. ఒక్క రూపాయికే కేజీ బియ్యం చొప్పున ఒక కార్డుదారుడికి ఐదు కేజీలు నెల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం. ఇందుకు ఏర్పాట్లు జ‌రిగినా, శ్రీ‌కాకుళం జిల్లాలో స‌ర్వ‌ర్ అడ్డుకుంటోంది. అందుకు కార‌ణం మాత్రం తెలియ‌డం లేదు. స‌ర్వ‌ర్ మోరాయింపు కార‌ణంగానే ఇలా జ‌రుగుతోంది. లేదా ఉద్దేశ పూర్వ‌కంగానే ఇలా చేస్తున్నారా అ న్న సంశ‌యం కూడా డీల‌ర్ల నుంచి వ‌స్తోంది. సర్వ‌ర్ మోరాయింపు ఒక్క నెల కాదు రెండు నెల‌లు కాదు ఏకంగా మూడు నెల‌లుగా ఇదే విధంగా అవుతోంది. అయినా కూడా స‌మ‌స్యెందుకు ప‌రిష్కారం కావ‌డం లేదు?


సంచార వాహ‌నాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న జ‌గ‌న్ అదే ఈ పోస్ యంత్రాల‌తో కేంద్రం ఇచ్చే బియ్యానికి కూడా వాడుతున్నా రు. మ‌రి! అక్క‌డ ప‌నిచేసి ఇక్క‌డెందుకు ప‌నిచేయ‌డం లేదు. కేంద్రం బియ్యం రాష్ట్ర ప్ర‌భుత్వానికి పంపిణీ చేయ‌డం ఇష్టం లేదా అ న్న వాద‌న ఒక‌టి డీల‌ర్ల సంఘం నుంచి వినిపిస్తోంది. రోజుకు 20 కార్డుల‌కు కూడా బియ్యం చేర‌వేయ‌డంలేద‌ని వీరంతా ఆవేద‌న చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: