తైవాన్ కోసం .. చైనా ఆరాటం ..

Chandrasekhar Reddy
చైనా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సరిహద్దు దేశాల ఆక్రమణ లేదా ఆధిపత్యం కోసం ఆ దేశం తీవ్రంగా పనిచేస్తుంది. దాని కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధం అంటుంది. గతంలో చైనా హ్యాంగ్ కాంగ్ ను ఆధీనంలోకి తెచుకున్నట్టే ఇప్పుడు తైవాన్ పై ఆధిపత్యం కోసం ఆరాటపడుతుంది. తాను కావాలి అనుకుంటే దానిని చేజిక్కించుకోడానికి ఎంత పనైనా చేసేందుకు సిద్ధం అవుతుంది చైనా. భారత్ తో సరిహద్దు ఉన్న చైనా ఎన్నో సార్లు సరిహద్దులలో పై చేయి సాధించాలని ప్రయత్నించి వెనుదిరిగింది. అందుకే మరోపక్క నుండి నరుక్కొద్దాం అని తాజా ఆఫ్ఘన్ అక్రమణకు వ్యూహరచన చేసింది.
ప్రస్తుతం దాని కన్ను తైవాన్ పై పడింది. గత కొంత కాలంగా ఆ దేశం సరిహద్దులలో ఆయుధాలు మోకరించడం, ఆదేశం వాయుమార్గంలో డ్రోన్లను ప్రవేశపెట్టడం లాంటివి చేస్తూ వస్తుంది. దీని వలన ఆ దేశాన్ని బయపెట్టో బలవంతంగానో చేజిక్కించుకొని దానిపై ఆధిపత్యం చేయాలన్నది చైనా కుతంత్రం. ఇలాంటివి చైనా సరిహద్దులను పంచుకున్న ప్రతి దేశానికీ ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉంటుంది. ప్రస్తుతం దాని కన్ను తైవాన్ పై పడింది. సాధారణంగా వాణిజ్య ఒప్పందాలు సరిహద్దు దేశాలతో పెట్టుకుంటాయి ఆయా దేశాలు. అదే తరహాలో సంబంధబాంధవ్యాలు సరిగా ఉన్నప్పుడు తైవాన్ లో పండ్లను చైనాకు దిగుమతి చేయడం ఆనవాయితీగా జరుగుతూనే ఉండేది.
కానీ ఇప్పటి చైనా మూడ్ ఆక్రమణ వైపు ఉంది కాబట్టి ఎప్పుడూ చెప్పని లోపాలను చూపిస్తూ తైవాన్ పండ్లను దిగుమతి చేసుకోవడానికి పనికి రావని, వాటిపై వైరస్ ఉంటుందని లేనిపోని కారణాలు చూపిస్తుంది చైనా. ఇలా ఆదేశ ఆర్థిక స్థితిపై దెబ్బకొట్టి దారికి తెచుకోవాలన్నది చైనా ఆలోచన. ఇలాంటి అనుభవం తాజాగా భారత్ కు కూడా ఉంది. భారత్  నుండి సముద్ర ఆహారం చైనాకు దిగుమతి అవుతుంది, కానీ తాజాగా ఆర్థికంగా దెబ్బ తీయాలనే కుటిల బుద్దితో భారత్ నుండి వచ్చే సముద్ర ఆహారం లో వైరస్ ఛాయలు కనిపిస్తున్నాయని సాకులు చెప్పి ఆ స్టాక్ ను దిగుమతి కాకుండానే ఆపేసింది.  ఇప్పుడు తైవాన్ పై కూడా అదే ఫార్ములా వాడింది చైనా. తనకు నచ్చితే వాణిజ్యం లేదంటే ఆర్థికంగా ఛిదిపేయాలనే ఆలోచన తోనే చైనా సరిహద్దు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుంది అనేది మరోసారి స్పష్టం అయ్యింది. అయితే చైనా కుయుక్తులకు తైవాన్ లొంగుతుందా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: