ఢిల్లీ టూర్ కు తెలంగాణా మంత్రి...? సడెన్ టూర్ ఎందుకు...?

Gullapally Rajesh
కేంద్ర మత్స్య,పశుసంవర్ధక,పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రిని కలిసిన తెలంగాణ మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మంత్రిని కలిసిన తర్వాత మీడియా తో మాట్లాడారు. మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాల పై కేంద్ర మంత్రిని కలిసాము అని ఆయన తెలిపారు. గొల్లకుర్మలు, మత్స్యకారులకు సబ్సిడీ పై ఇచ్చే ప్రయోజనాల గురించి, రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాల గురించి చర్చించాము అని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయదలచిన మెగా డైయిరీ ఏర్పాటు విషయంలో కేంద్ర సహకారం గురించి చర్చించామని పేర్కొన్నారు.
గతంలో తెలంగాణ లో పెట్టుబడి, పంటలకు సరియైన గిట్టుబాటు లేక పలు ఆత్మహత్య లు జరిగేవి అని అన్నారు. తెలంగాణ లో ప్రస్తుతం అమలు చేయబడుతున్న సంక్షేమ పథకాల వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గి, రైతులు ఆనందంగా ఉన్నారు  అని ప్ర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలు సహేతుకంగా లేవు అని పేర్కొన్నారు. ప్రభుత్వం పై చేస్తున్న విమర్శల సందర్భంలో ఉపయోగిస్తున్న బాష సరిగాలేదు అని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది అని అన్నారు. హైదరాబాదులో మా ప్రభుత్వ హయామంలో ఊహించని అభివృద్ధి జరిగింది అని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది అని ఆయన అన్నారు. రాబోయే రోజులలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండబోతుంది అని ఆయన పేర్కొన్నారు. గతంలో లేని ఆర్ధిక సహకారం నేడు మత్స్యకారులకు అందుతుంది అని వివరించారు. రాష్ట్రంలో గతంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలను నేడు మా ప్రభుత్వం చేపడుతుంది అని ఆయన తెలిపారు. వరి పంట సాగు విషయంలో జిల్లాల వారిగా రైతులను చైతన్యం చేసి , ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గుచూపేలా చైతన్యం చేస్తాం అన్నారు ఆయన. రాష్ట్రం నుండి మత్స్య , గొర్రె మాంసం ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి ఉత్పత్తిదారులకు సరియైన గిట్టుబాటు ధర లభించేలా ప్రయత్నం చేస్తాము అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: