జ‌స్ట్ ఆస్కింగ్ : సీఎం ఇలాకాలో ఇంటి దొంగ‌లు ఎవ‌రు?

RATNA KISHORE
ఏడేళ్లుగా డ‌బ్బు రోడ్డు దాటిపోతోంది. గ‌త ప్ర‌భుత్వం నుంచి ఈ ప్ర‌భుత్వం వ‌ర‌కూ డబ్బుల‌కు రెక్క‌లు ఎలా వ‌చ్చాయి. సచివాల యం కానీ సీఎంఓ కానీ వీటిపై దృష్టి సారించి ఎందుకు నిలువ‌రించ‌లేక‌పోయిందో? ఇప్పుడున్న స‌మాచారం మేర‌కు సీఎంఆర్ఎఫ్ లాగిన్ , పాస్వార్డ్ లు తెలిసిన వారే నిధుల‌ను గోల్ మాల్ చేశారు అని టాక్. వీటిపై చంద్ర‌బాబుతో పాటు జ‌గ‌న్ కూడా స‌మాధానం చెప్పాలి.


రెండు ప్ర‌భుత్వాల హ‌యాంలో న‌లుగుతున్న స్కాం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చి కొన్ని నిజాల‌ను వెల్ల‌డించింది. ప్రాథ‌మిక వివరం అనుస‌రించి ఏడేళ్లుగా 117 కోట్ల రూపాయ‌లు చెయ్యిదాటిపోయి ప్ర‌భుత్వ సొమ్ము కాస్తా ఎవరెవ‌రి జేబుల్లోనో జ‌మ అయిపోయింది. ఫ‌లితంగా రంగంలోకి దిగిన ఏసీబీ ఈ పెద్ద చేప‌ల్లో ఒక పీఏ కూడా ఉన్నాడ‌ని గుర్తించింది. ఇంకా ఇంకొంద‌రి జాడ‌నూ వెలుగులోకి తెస్తోంది. మ‌రి! పేద‌ల కోసం, ఆప‌ద‌లో ఉన్న వారి కోసం కేటాయించిన డ‌బ్బు స‌చివాల‌యం రోడ్డు దాటించేసిన పెద్ద‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు ఎప్పుడు?

 
సీఎం రిలీఫ్ ఫండ్. క‌ష్టం వ‌స్తే ఆదుకునేందుకు, పేద‌ల‌కు అండ‌గా ఉండేదుకు నిర్దేశించిన నిధి. ఇందులో డ‌బ్బులు సైతం కొంత‌మం ది కాజేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందుకు కార‌ణం అయిన వారిని పోలీసులు, దర్యాప్తు బృందాలు (ఏసీబీ) గుర్తించింద‌ని స‌మా చారం. మ‌రి! వంద కోట్ల‌కు పైగా నిధులు బొక్కేసిన పెద్ద‌లు ఎవ‌రు? వారి వివ‌రం ఏంట‌న్న‌ది తేలాలి. 2014 నుంచి జ‌రుగుతున్న బా గోతం ఆల‌స్యంగా వెలుగు చూసింది. అంతేకాదు ఆశ్చ‌ర్య క‌ర విష‌యాల‌నూ వెల్ల‌డిచేసింది. సీఎంఆర్ఎఫ్ లో నిధుల గోల్ మాల్ పై ఏసీబీ విచార‌ణ‌లో సంబంధిత బాధ్యులు ఎవ‌ర‌న్న‌ది తేలింది. ముఖ్యంగా ఈ విభాగంలో ప‌నిచేసే వారే అస‌లు దొంగ‌ల‌ని తేలింది. వీరి తో పాటు మ‌రొక‌రి పేరు కూడా వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ కేసులో న‌లుగురిని అరెస్టు చేశారు. గ‌త ఏడాది నుంచి దీనిపై ద‌ర్యాప్తు సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: