సీఎం ఖజానాకే .. చిల్లు ..

Chandrasekhar Reddy
ఏపీలో ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను మాత్రం సేవకుడినే అని చెప్తూ ప్రజాసేవ చేస్తూ పోతున్నారు. రాజకీయాలు అంటే వెన్నుపోట్లు, కక్కుర్తి పనులు సహజంగా అధికార పార్టీలో చోటుచేసుకుంటూ ఉంటాయి. అదే తరహాలో సీఎం వెనుక కూడా అలాంటివి చోటుచేసుకుంటున్నాయని తాజా విచారణలో తేలింది. అందరు మంచివారే అని నమ్మితే అక్కడక్కడా కక్కుర్తితో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అడుగు ముందుకు వేసినా విపక్షాలు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతూనే ఉన్నాయి. వారికి తోడుగా అధికార పక్షంలో కొందరు పెద్దలు కూడా చిన్న చిన్న విషయాలకు కక్కుర్తి పడి ప్రభుత్వానికి నామర్దా తెస్తున్నారు.
తాజాగా ఏసీబీ సచివాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయానిధులను తప్పుగా వినియోగిస్తున్నట్టు తేల్చింది. దీనిలో సచివాలయ సిబ్బంది సహా పలువురు పెద్దల పిఎ లు, వాళ్ళ అనుచరులు ఉన్నట్టు తెలుస్తుంది. వీరు సచివాలయంలో లబ్ధిదారుల డాటాను అడ్డుపెట్టుకొని లేనిపోని అవసరాలను సృష్టించి ముఖ్యమంత్రి సహాయనిధులను కాజేస్తున్నట్టు తేల్చింది ఏసీబీ. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితం సీఎంఆర్.ఎఫ్.  అధికారులు పిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన ఏసీబీ కొందరు సచివాలయ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ, తప్పుడు దారులలో ముఖ్యమంత్రి సహాయనిధులను దారిమళ్లిస్తున్నట్టు తేల్చింది.
మే నుండి ఏసీబీ ఈ కేసుపై పలువురిని విచారణ చేస్తుంది. కొందరిని ఇప్పటికే విచారించగా, మరికొందరికి నోటీసులు ఇచ్చింది. అయినా వారు స్పందించక పోవడంతో మళ్ళీ తాజాగా విచారణకు సహకరించాలని నోటీసులు జారీచేసింది. విడతల వారీగా ఈ విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ చెపుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించలేదు. ఇందులో పలువురు నేతల వద్ద పనిచేసే వారి హస్తం ఉన్నట్టు ఏసీబీ తేల్చింది. వారి పేర్లు మాత్రం బయటకు రానీయడం లేదు, ఇంటిదొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే చందాన ఈ కేసు కూడా నీరుగారిపోతుందా లేక తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఏసీబీ మాత్రం కూలంకషంగా విచారణ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: