ఆఫ్గాన్ లో అరాచకం.. తాలిబన్లు కాదు.. ఎవరంటే?

praveen
ఇటీవలే ఆయుధాలను చేతపట్టి.. ప్రజా స్వామ్యాన్ని మంటగలిపి.. ప్రజలందరినీ బానిసలుగా మార్చుకుని.. ఎదురు చెప్పిన వారిని దారుణంగా కాల్చి చంపుతూ.. మహిళలు అందరినీ చిత్ర హింసలకు గురిచేస్తూ ఎన్నో అరాచకాలు తర్వాత ఆఫ్ఘనిస్థాన్లో ఆధిపత్యాన్ని చేపట్టారు తాలిబన్లు.  అంతర్జాతీయ సమాజం తమను అంగీకరించినా అంగీకరించక పోయినా తాము ఆఫ్ఘనిస్థాన్లో పాలన సాగిస్తాము అంటూ ఇటీవల తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. పైపైకి ప్రజలను చిత్ర హింసలకు గురి చేయటం లేదు అంటూ చెబుతూనే మరో వైపు దారుణం గా ప్రవర్తిస్తున్నారు.

 ముఖ్యం గా మహిళల రక్షణ అయితే ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల పాలనలో ప్రశ్నార్థకం గానే మారి పోయింది అని చెప్పాలి. కనీసం ధైర్యం గా బయటకు వెళ్లి ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది.  అయితే తాలిబన్లు ఆధిపత్యం లోకి రాగా.. ఇటీవలే ఐఎస్ఐఎస్ కే తీవ్ర వాదులు మాత్రం దారుణం గా వ్యవహరిస్తున్నారు. ఇస్లామిక్ రాజ్య స్థాపన తీవ్ర వాద ముఖ్య లక్ష్యం అని చెబుతూ ఉంటారు.  ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు అధికారం లోకి రావడం తో ఇస్లామిక్ రాజ్యం నడుస్తుంది అని చెప్పాలి.

 కానీ ఇలాంటి సందర్భంలోనే ఇస్లామిక్ రాజ్యం కోసం ఎప్పుడూ కుట్రలు చేస్తూ దారుణాలకు పాల్పడే ఐఎస్ఐఎస్ కె   తీవ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్లో మూడు రోజుల వ్యవధిలో ఏడు ప్రాంతాలలో బాంబు పేలుళ్ళు జరపడం సంచలనంగా మారిపోయింది.  తాలిబన్ల బృందంలోని సైనికులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేపట్టినట్లు  తీవ్రవాద బృందం ప్రకటించింది.  ఇక ఇందులో 35 మంది చనిపోయారని ఇక ఈ ఉగ్రమూక ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కానీ తాలిబన్లు మాత్రం ఎవరూ చనిపోలేదని ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పుకొచ్చింది. అయితే ఆఫ్ఘనిస్థాన్లో అటు ఇస్లామిక్ పాలన నడుస్తున్నప్పటికీ ఎందుకు తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: