విజయనగరం వార్త : ఆ మాజీ ఎమ్మెల్యే ఏం చేశారంటే?

RATNA KISHORE
మాట‌లు చెప్పి నెగ్గుకు రావ‌డం క‌న్నా ఏమ‌యినా చేయాలి. త‌న ప‌రిధిలో ఓ స్ట‌డీ స‌ర్కిల్ ను ప్రారంభించి ఆ ఎమ్మెల్యే మంచి పేరు తెచ్చుకున్నారు. పేద విద్యార్థుల‌కు అండ‌గా నిలిచి త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి వ‌ర‌కూ చేత‌ నైనంత సాయం చేస్తున్నారు. భ‌విష్య‌త్ లో అన్నీ బాగుంటే త‌న సంక‌ల్పం మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాల‌కు దోహదం కావాల‌ని ఆశిస్తున్నాన‌ని ఆ నేత అంటున్నారు.
ఇంత‌కూ ఎవ‌రాయ‌న‌?

నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అండగా ఉండాలి. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉన్నంతలో ఉత్తమ శ్రేణి విద్య అందించి, వారిని మరింత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ఇవన్నీ రాసుకునేందుకు బాగుంటాయి. ప లికేందుకు, చదివేందుకు ఇంకా బా గుంటాయి. కానీ ఆ ఎమ్మెల్యే అలా కాదు. అనుకున్నది సాధించారు. తనకు బాగా తెలిసిన పద్ధతిలోనే నిరుద్యోగ యువతకు పాఠాలు చెప్పించేందుకు ముందుకు వచ్చారు. తన సొంత ని ధులతో విజ‌య‌న‌గరం, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా స్టడీ సెంటర్ ఆరంభించారు. రాష్ట్రంలో అత్యున్న‌తంగా పోటీ ప‌రీక్ష‌లకు పాఠాలు బోధించే, శిక్ష‌ణ అందించే విష‌య నిపుణుల‌ను ఎంపిక చేసి, వారితోనే నేరుగా త‌ర‌గ‌తులు ని ర్వ‌హించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ 120 మంది యువ‌త‌ను ఎంపిక చేశారు. వీరికి శిక్ష‌ణ అందిస్తున్నారు. గ‌జ‌ప‌తి న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థుల‌కే  ఈ కార్య‌క్ర‌మాన్ని ప‌రిమితం చేస్తామ‌ని, భ‌విష్య‌త్ లో అవ‌ కాశం ఉన్నంత వ‌ర‌కూ జిల్లా స్థాయిలో విద్యార్థుల‌ను పోటీ ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించే ఆలోచ‌న ఉంద‌ని స్ట‌డీ సెంట‌ర్ నిర్వాహ‌కులు తెలిపారు. త‌మ‌ను ఆన్లైన్ లో అభ్య‌ర్థిస్తే చాలు గ‌జ‌ప‌తి న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం (గ‌జ‌పతిన‌గ‌రం, బొండ‌ప‌ల్లి, ద‌త్తిరాజేరు, గంట్యాడ, జామి) వ‌ర‌కూ అవ‌కాశం ఉన్న‌, అర్హ‌త ఉన్న విద్యార్థుల‌కు ఈ శిక్ష‌ణ ను ఉచితంగానే అందించేందుకు తాము సిద్ధ‌మ‌ని వెల్ల‌డించారు.

ఇవన్నీ ఓ మాజీ ఎమ్మెల్యే చేస్తున్నారు. ఆయన డాక్ట‌ర్ కొండపల్లి అప్పలనాయుడు. విజయనగరం జిల్లా, గజపతి నగరం ఎమ్మె ల్యే గా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో బొత్స అప్పల నర్సయ్య చేతిలో ఓడిపోయారు. ఓడి పోయాను కదా అని ఆయనేం ఇంట్లో కూర్చోలేదు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేస్తున్నారు. అక్కడితో ఆగిపోలేదు. తన విద్యా సంస్థల ద్వారా పదుగురికీ ఉపాధి ఇస్తూనే, ఈ స్టడీ సెంటర్ కు విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో శ్రీకారం దిద్దారు. ఇప్పుడు ఎస్ఎస్సీ:గ్రూప్-డీ కానిస్టేబుల్ పరీక్షలకు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ శిక్షణకు గాను రాష్ట్ర స్థాయిలో పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న అత్యుత్తమ బోధకులను ఎంపిక చేసి, ఆ స్టడీ సెంటర్ కి తీసుకొని వచ్చి శిక్షణ ఇప్పిస్తున్నారు. అర్థ‌మెటిక్ కు సంబంధించి రావాడ ముత్యాల నాయుడు బోధిస్తున్నారు.ఈయ‌న తాటిపూడి గ్రామ వాస్త‌వ్యులు.16 సంవ‌త్సరాలుగా బోధ‌నా రంగంలో ఉన్న విష‌య నిపుణులు, ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కూ చిర‌ప‌రిచిత‌మైన బోధ‌కులు.పోటీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఎన్నో పుస్త‌కాల‌ను ర‌చించి, సంపాద‌క‌త్వం వ‌హించి, ప్ర‌చురించారు.ఈయ‌న నేతృత్వంలోనే శిక్ష‌ణా శిబిరం న‌డుస్తోంది. సాఫ్ట్ స్కిల్స్ ను వేమలి చైతన్య బాబు బోధిస్తున్నారు. ఈయన విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు. ఎంటెక్ గ్రాడ్యుయెట్. రాజకీయాలపై ఆసక్తితో ఇటుగా వచ్చారు. అయినప్పటికీ తనకు టీచింగ్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని నెరవేర్చుకునే క్రమంలో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.

ఎలా చేరాలంటే...
గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న కొండపల్లి అప్పలనాయుడు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు అందిస్తే చాలు విజ య‌న‌గ‌రంలో నిర్వ‌హించే స్ట‌డీ సెంటర్ లో సులువుగా చేరిపోవచ్చు. ఇందుకు ఫీజు ఏమీ ఉండదు. ప్రవేశం ఉచితం..శిక్షణ ఉచితం. రేపటి రోజుకు భరోసా ఇస్తూ స్టడీ సెంటర్ నిర్వహించడమే ఆయన లక్ష్యం. ప్రజాప్రతినిధులంతా ఇలాంటి స్టడీ సర్కిల్స్ ఎందుకు ఏ ర్పాటు చేయరు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: