రాజకీయాల్లో బిగ్ బాస్ షో, నారాయణ మరోసారి...?

Sahithya
ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటూ సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. అటు మోడీ..ఇటు కేసీఆర్ పతనం అవుతారని అన్నారు. ధర్నా చౌక్ వద్ద ఆయన అఖిల పక్ష నేతలు నిర్వహిస్తున్న ధర్నా లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మండలం నుంచి దేశ స్థాయి వరకు అఖిల పక్షం పోరాటం మొదలయ్యింది అని ఆయన తెలిపారు. ఈ ధర్నా దేశ రాజకీయాలకు కీలక మలుపు అని ఆయన వెల్లడించారు. హెరాయిన్ మాదక ద్రవ్యం గుజరాత్ నుంచే వచ్చింది అని ఆయన తెలిపారు.
ముంద్రా మోడీకి దత్త పుత్రుడు అని అన్నారు నారాయణ. విజయ మాల్య తప్పా దేశం లో అందరూ గుజరాత్ గుండాలు అని వ్యాఖ్యానించారు. మోడీ వచ్చాకా గజ దొంగలు విదేశాలకు పారిపోయారు అని ఆయన విమర్శించారు. గజ దొంగలు ను మోడీ కాపాడుతున్నారు అని మండిపడ్డారు. పంచ భూతాలను మోడీ అమ్మి వేస్తున్నారు అని ఆరోపణలు చేసారు. ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేసారు. మతోన్మాదం పెరిగి పోతుంది అని మండిపడ్డారు. మోడీని విమర్శిస్తే సిబిఐ కేసులు పెడుతుంది అని ఆరోపించారు.
మోడీని పొగిడితే బీజేపీ లో  అందలం ఎక్కిస్తారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశానికి తలమానికం అని ఆయన తెలిపారు. 3 లక్షల కోట్లు విలువ చేసే కంపెనీ  30 వేల కోట్లకు అమ్ముతున్నారు అని ఆయన కామెంట్ చేసారు. బిగ్ బాస్ షో ప్రభావం రాజకీయాల మీద పడింది అని ఆయన వ్యాఖ్యానించారు. పద్మ భూషణ్ బిరుదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి,కేసీఆర్ కు ఇవ్వాలి అని ఆయన ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డి కి కన్సోలేశన్ ప్రైజ్ ఇవ్వాలి అన్నారు. రెండు రాష్ట్రాల్లో రాజకీయ తిట్లదండకం సాగుతుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cpi

సంబంధిత వార్తలు: