దాసన్న రాజకీయం : వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ? ఇప్పుడు జెడ్పీటీసీ !

RATNA KISHORE
జగన్ వెంట ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఉన్న ముఖ్య నాయకులలో  ధర్మాన కృష్ణదాసు ఒకరు. సాధారణ డిగ్రీ చదువుతోనే రాజకీయాల్లో రాణించిన దాసన్న ఇప్పటిదాకా ఎన్నో విజయాలు అందుకున్నారు. శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గ రాజకీయాలలో ఆయనతో పాటు ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు కీలకంగా ఉంటున్నారు. వైసీపీ ఆవిర్భావం వేళ కాంగ్రెస్ ను వీడి జగన్ వెంట వెళ్లారు. కానీ ప్రసాద్ మాత్రం ఉండిపోయారు. తరువాత పార్టీ మారారు. వైసీపీ కండువా వేసుకున్నారు. ప్రసాద్ కన్నా కృష్ణదాస్ కాస్త నెమ్మది. దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి కాదు. అదేవిధంగా క్రీడలంటే ఆసక్తి ఉన్న మనిషి. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ప్రసాద్ నడిపించిన విధంగానే ఉంటుందని కొందరు అంటారు. ఏదేమైనప్పటికీ వారసుల రాకతో వీరిద్దరూ రాజకీయాలకు దూరం కావాలని అనుకుంటున్నారు.
ధర్మాన ప్రసాద్ తన కొడుకు రాం మనోహర్ నాయుడిని స్థానిక పోరులో నిలబెట్టనప్పటికీ, ధర్మాన కృష్ణదాసు మాత్రం తమకెంతో కలిసి వచ్చిన పోలాకి జెడ్పీటీసీ స్థానం నుంచి కొడుకును పోటీచేయించి, గెలిపించారు. గతంలో ఇదే స్థానానికి కృష్ణదాసు భార్య పద్మ ప్రియ జెడ్పీటీసీగా వ్యవహరించారు. ఈమె శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ విభాగం తొలి అధ్యక్షురాలు కావడం విశేషం.


శ్రీకాకుళం రాజకీయాల్లో తిరుగులేని నేత అని ధర్మాన కృష్ణదాసుకు పేరుంది. నరసన్నపేట నియోజకవర్గం నుంచి వరుసగా గెలిచి న ఆయన ఈ సారి రాజకీయాల్లో మరింత ఉన్నతిని సాధించి డిప్యూటీ సీఎం అయ్యారు. జగన్ వెంట మొదట నుంచి నడిచిన కు టుంబంగా దాసన్న కుటుంబానికి మంచి పేరుంది. అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉంటూ జిల్లా రాజకీయాల్లోనూ, రాష్ట్ర రాజకీ యాల్లోనూ తనదైన ముద్ర వేసిన దాసన్న త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్య రానున్నారు. ఈ క్రమంలోనే ఆయనను పోలాకీ జెడ్పీటీసీ గా రంగంలో దింపి గెలిపించారు. ఉన్నత విద్యావం తుడైన కృష్ణ చైతన్య రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని తెలుస్తోంది. స్థానిక రాజకీయాలు, స్థానిక సమస్యలు తెలుసుకునే క్రమంలో కృష్ణ చైతన్య ఈ పదవిని వినియోగించుకోవాలని తండ్రి దాసన్న భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: