మెగాస్టార్ అంటే జ‌గ‌న్ కు చాలా ఇష్టం : పేర్ని నాని

సోమ‌వారం ఏపీ మంత్రి పేర్నినాని సీనీ పెద్ద‌లు నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌భ్యుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే . ఈ సమావేశంలో పేర్నినాని చిరంజీవి ఆదివారం లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన విజ్క్షాప‌న‌ను గుర్తు చేశారు. చిరంజీవి రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సినీ ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాల‌ని కోర‌టంపై పేర్ని స్పందించి సీఎం జ‌గ‌న్ కు చిరంజీవి అంటే చాలా ఇష్ట‌మ‌ని ..సోద‌ర భావంతో ఉంటార‌ని చెప్పారు . చిరంజీవి చేసిన విజ్ఞాప‌ణ‌ను ప‌రిగ‌ణలోకి తీసుకుంటామ‌ని చెప్పారు. అంతే కాకుండా పేర్నినాని మాట్లాడుతూ...ఆన్లైన్ టికెటింగ్ విధానంపై సీనీ పెద్ద‌ల‌తో చ‌ర్చించామ‌ని అలాగే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ గురించి చ‌ర్చించామ‌ని చెప్పారు .
ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని అంగీరించార‌ని ..అన్లైన్ టికెటింగ్ పై ఇన్ పుట్స్ ఇచ్చి ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం నిర్దేశించిన ధ‌ర‌ల‌కే టికెట్ల‌కు అమ్మేందుకు కూడా ఓకే చెప్పార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేసే నిర్ణ‌యాల‌ను ఎవ‌రు తీస‌కున్నా సీఎం అంగీక‌రిస్తార‌ని అన్నారు. వినోదంపై భారం పెరుగుతుంద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నించకుండా సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పార‌ద‌ర్శ‌కంగా ఉంచుతామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌కు అన్ని వ‌ర్గాల‌నుండి సానుకూల స్పంద‌న వచ్చిందని పేర్నినాని వెల్ల‌డించారు .
చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా వ్యాపారాలు చేసే ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాద‌నే భావిస్తున్నామ‌ని పేర్నినాని తెలిపారు. నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ లు ప్ర‌భుత్వం ఇలా చేస్తే భాగుంటుంద‌ని ప‌లు అంశాల‌ను త‌మ దృష్టికి తీసుకువ‌చ్చార‌ని వాటిని ప‌రిశీలిస్తామ‌ని పేర్ని నాని వెల్ల‌డించారు. అంతే కాకుండా ఈరోజు జ‌రిగిన స‌మావేశంలో ఒక్కరు కూడా బెనిఫిట్ షోల గురించి ప్ర‌శ్నించ‌లేద‌ని చెప్పారు. సినీ పెద్ద‌ల విజ్ఞ‌ప్తుల‌న్నింటికీ సానుకూలంగా స్పందించామ‌ని పేర్నినాని వెల్ల‌డించారు. వైఎస్ఆర్ సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ఏవిధంగా కృషి చేశారో సీఎం జ‌గ‌న్ కూడా అదేవిధంగా కృషి చేస్తార‌ని చెప్పారు .  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: