నిఝెంగా నిజం : కేటీఆర్ ను టార్గెట్ చేస్తే క్రేజ్ వ‌స్తుందా?

RATNA KISHORE
రేవంత్ - కేటీఆర్
విశ్వేశ్వ‌ర రెడ్డి - కేటీఆర్
బండి సంజ‌య్ - కేటీఆర్
ఇలా ఎన్ని కాంబినేష‌న్లు రాయాలో! నిన్న మొన్న ఫాంలోకి వ‌చ్చిన బీజేపీ మొద‌లుకుని ఎప్ప‌టి నుంచో రాజ‌కీయాలు న‌డుపుతున్న వారు కూడా కేటీఆర్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఆయ‌న త‌ప్పిదాలు ఉంటే ఆధారాల‌తో మాట్లాడాలి కానీ ఈ విధంగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో ఎందుకు దిగ‌జారి రాజ‌కీయం న‌డుపుతున్నారు? ఇవే ప్ర‌శ్న‌లు గులాబీ దండును వేధిస్తున్నాయి. 
దీంతో కేటీఆర్ కోర్టు మెట్లు ఎక్కారు.రేవంత్ పై ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఇంకా వాగితే రాజ‌ద్రోహం కేసు న‌మోదు చేయ‌డం త‌థ్య‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కానీ రేవంత్ త‌గ్గ‌లేదు. ఈ రోజు కూడా గ‌న్ పార్క్ అమ‌ర వీరుల స్థూపం ద‌గ్గ‌ర కేటీఆర్ ను ఉద్దేశించి నానా మాట‌లూ అన్నారు.వాటికో ఆధారం వాటిలో విలువ అన్న‌వి లేవు. ఆయ‌న మాటలే కాదు కొండారెడ్డి కూడా అలానే మాట్లాడారు.

తెలంగాణ స‌మాజంలో చైత‌న్యం చాలా ఎక్కువ. ముఖ్యంగా రాజ‌కీయ చైత‌న్యం కార‌ణంగానే అక్క‌డ త‌రుచూ వివాదాలు కాస్త ఎక్కువ‌గానే ఉంటాయి. తెలంగాణ అన్న‌ది ఇంటి పార్టీ ప‌రం కావ‌డం అన్న‌ది త‌మకు ఇష్టం లేద‌ని విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్న నేప‌థ్యంలో త‌రుచూ ఆరోప‌ణ‌లూ, ప్ర‌త్యారోప‌ణ‌లూ పెరిగిపోతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను దృష్టిలో ఉంచుకుని మాట్లాడ‌కుం డా, స్థాయిని త‌గ్గించే విధంగా ఆరోప‌ణ‌లు చేస్తూ చెల‌రేగిపోతున్నారు కొంద‌రు విప‌క్ష పార్టీ నాయ‌కులు.  పూర్తిగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ ఆయ‌న‌తో పాటూ కేటీఆర్ నూ టార్గెట్ చేయ‌డం వెనుక పెద్ద ల‌క్ష్య‌మే ఉంది. కేటీఆర్ ను తిడితే మీడియాలో త‌మ‌కు క్రేజ్ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతోనే రేవంత్ కానీ ఇంకొక‌రు కానీ త‌రుచూ మాట్లాడుతున్నార‌ని కొంద‌రు పరిశీల‌కులు అంటున్నారు. మొన్న‌టి వ‌రకూ మ‌ల్ల‌న్న నోటికి వ‌చ్చిందంతా వాగాడు. ఇప్పుడు కేసులంటూ, బెయిళ్లంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇదేవిధంగా రేవంత్ రేప‌టి వేళ కేసులలో ఇరుక్కుపోవ‌డం ప‌క్కా అని ఎన్నిక‌ల ముందు ఆయ‌న‌ను కేసుల్లో ఇరికించేందుకు ప్ర‌భుత్వం త‌ప్ప‌క ప‌న్నాగం ప‌న్నుతుంద‌ని కొంద‌రు అంటున్నారు. రేవంత్ కూడా భాష‌ను అస్స‌లు ఉప‌యోగించాల్సిన తీరులో ఉప‌యోగించ‌డం లేద‌న్న వాద‌న‌ను బ‌ల‌ప‌రుస్తూ, త‌రుచూ మాట్లాడుతున్నారు. ఈ కార‌ణంగానే ఆయ‌న క్రేజ్ తెచ్చుకుని, ప్ర‌జ‌ల్లో గుర్తింపు పొందాల‌ని చూస్తున్నారు. మ‌రీ! దిగ‌జారే భాష మాట్లాడితే త‌న‌కు ప్ర‌త్యేక‌మ‌యిన ఫాలోయింగ్ ఒక‌టి వ‌స్తుంద‌న్న త‌హ‌త‌హ ఆయ‌న‌లో పుష్క‌లంగా ఉంది. కానీ ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల్సిన పార్టీలు ఆయ‌న ఆ రోజు
అలా తిట్టారు క‌నుక మేం ఈ రోజు ఆయ‌న‌ను  ఇలా తిడ‌తాం అని లాజిక్కులు మాట్లాడుతుండ‌డ‌మే విడ్డూరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: