జ‌గ‌న్ ఇలాకా : కోర్టు వాకిట తిరుప‌తి స‌మ‌స్య ?

RATNA KISHORE
జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రో వివాదంలో ఇరుక్కుంది. టీడీపీ పాల‌క మండలి ఏర్పాటుపై ఇప్ప‌టికే అనుమానాలు రేగుతుండడంతో పాటు అస‌లీ నియామ‌కాలే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయ‌ని బీజేపీ మండిప‌డుతోంది. ఎవరు ఎ న్ని చెప్పినా కూడా తాను త‌గ్గేదే లే అన్న విధంగా ఉన్న జ‌గ‌న్ ను మ‌రో సారి కోర్టు ఏమ‌న‌బోతోంది అన్న‌ది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఈ మేర‌కు జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ యం పై టీడీపీ నాయ‌కులు హై కోర్టులో పిల్ వేశారు. మాదినేని ఉమామహేశ్వ‌ర నాయుడు పేరిట ఈ పిల్ దాఖ‌లైంది. మ‌రోవైపు బీజేపీ కూడా టీటీడీ కొత్త పాలక‌వ‌ర్గం ఏర్పాటు, ప్ర‌త్యేక ఆహ్వానితుల పేరిట 52 మందిని నియ‌మించడం త‌దిత‌ర అంశాల‌పై మండి ప‌డుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేశారు. అయిన‌వారిని నియ‌మించుకునేందుకు ఇంత‌టి భారీ స్థాయిలో పాల‌క‌మండలి ఏర్పాటు చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధం అని అంటున్నారు.

వివాదాలు కొత్తేంకాదు :
టీటీడీ హ‌యాంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చాక అక్క‌డ ప‌నిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల పెంపుపై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు న‌డుస్తున్నాయి. అదేవిధంగా క‌రోనా సాకుతో సాధార‌ణ ద‌ర్శ‌నాలు నిలిపివేశార‌ని ఆరోప‌ణ ఒక‌టి న‌డుస్తోంది. ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి కొన్ని రాజకీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గుతున్నార‌న్న విమ‌ర్శ‌లూ ఉన్నాయి. స‌ప్త‌గిరి ప‌త్రిక అక‌స్మాత్తుగా ఆపేసిన ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం మ‌రోసారి విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఆఖరికి అక్టోబ‌ర్ నుంచి స‌ప్త‌గిరి ప‌త్రిక‌ను పున‌రుద్ధ‌రించే అవ‌కాశా లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇవేకాదు ఆధ్యాత్మిక సంస్థ‌ల్లో రాజ‌కీయ జోక్యం పెంచేవిధంగా కొత్త పాల‌క మండ‌లి  ఉన్నందున సాధార‌ణ పౌరుల‌కు స్వామి ద‌ర్శ‌నం అన్న‌ది ఎలా సులువు అవుతుంద‌న్న ప్ర‌శ్న ఒక‌టి వినిపిస్తోంది. చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో బ‌ల‌పడేందుకు ఎంతో అయిష్టంగా చేప‌ట్టిన ఈ ప‌ద‌వి కార‌ణంగా ఆయ‌న కాస్త అస‌హ‌నంతోనే ఉన్నారు. వీటితో పాటు టీటీడీ ఇతర ఆల‌యాల అభివృద్ధికి చేయాల్సిన సాయం చేయ‌డం లేదు. జిల్లాల‌లో అన్న‌మ‌య్య సంకీర్త‌నా స్ర‌వంతి పేరిట నిర్వ‌హించే ప్రాజెక్టు నిలిపివేసింది. వీటితో పాటు వ్య‌య నియంత్ర‌ణ అన్నది ఆల‌య ప‌రిధిలో లేదు అని కూడా తేలింది. కొన్ని సంద‌ర్భాల్లో టీటీడీ నుంచి కొంత డ‌బ్బులు ప్ర‌భుత్వం రుణ రూపేణా తీసుకోవాల‌ని భావించి, భంగ‌ప‌డింది. అదేవిధంగా స్వామి న‌గ‌లు తాకట్టు పెట్టి రుణాలు తేవాల‌నీ యోచించింది. ఇవేవీ అమలుకు నోచుకోలేదు అని ఊపిరి పీల్చుకోవ‌డం మిన‌హా  సాధించేదేమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: