బొత్స ఇలాకా: కొత్త ముఖం తెర‌పైకి? కోల‌గ‌ట్లే కార‌ణం !

RATNA KISHORE
శ‌త్రువు అని క్ష‌మించే ర‌కం కాదు .. శ‌త్రువు అని క‌లుపుకుని పోలేడు కూడా! జ‌గ‌న్ చెప్పినా బొత్స మార‌డు.రౌడీ రాజ‌కీయంలో ఆయ‌నను దాటిన వాడు కూడా లేడు అని టీడీపీ అంటోంది. అలా అన్నా కూడా బొత్స సాయం టీడీపీ పొందుతోంది. అదే విడ్డూ రం. ఇప్పుడు అశోక్ గ‌జ‌ప‌తి రాజు కూతురు అదితి గెల‌వాల‌న్నా, ఇంకొక‌రు గెల‌వాల‌న్నా బొత్స దే హ‌వా! కానీ ఈ సారి బొత్స మాట ఎన్నిక‌ల్లో చెల్ల‌లేదు. అది ఇంకా విడ్డూరం. కనుక‌నే ఆయ‌న మ‌ద్దతు లేకుండానే కోల‌గ‌ట్ల గెలిచి విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యేగా జ‌య‌కేతనం ఎగుర‌వేసి, అధిష్టానాన్నే అబ్బుర‌ప‌రిచాడు. అయిన‌ప్ప‌టికీ తుఫాను బొత్స రూపంలో ఉంద‌న్న భ‌యం కోల‌గ‌ట్ల‌లో ఉంది.....క‌నుక‌నే  ఆయ‌న కొన్ని జాగ్ర‌త్త‌ల‌తో కూడిన రాజ‌కీయం న‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం ఆమె డిప్యూటీ మేయ‌ర్ గా విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ కు సేవ‌లందిస్తున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో 29వ డివిజన్ నుంచి కార్పొరేట‌ర్ గాఎన్నిక‌య్యారు.  
వైశ్య సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత కోల‌గ‌ట్ల. ఉత్త‌రాంధ్ర రాజ‌కీయంలో వైశ్య సామాజిక‌వ‌ర్గంకు మంచి ప‌ట్టున్నప్ప‌టికీ, ఎమ్మెల్యే గా, అటు వివిధ పార్టీల‌లో క్రియాశీల వ్య‌క్తిగా రాణిస్తున్న వ్య‌క్తి ఆయ‌న‌. విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాల్లో బొత్స కోపానికి ఎన్నో సార్లు బ‌లైపోయిన వ్య‌క్తి కూడా ఆయ‌నే! అయిన‌ప్ప‌టికీ పోరాటం చేస్తూ ఓట‌మి, గెలుపు అన్న‌వి ప‌ట్టింపులేకుండా త‌న  ప‌ని తాను చే సుకుని పోతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు బొత్స ఆయ‌న‌కు అడ్డంగానే ఉన్నారు. మొద‌టి నుంచి ఆయ‌న‌పై ఉన్న వ్య‌తిరేక భావ‌న‌ను అదేవిధంగా కొన‌సాగిస్తున్నారు. ఓ విధంగా బ‌లీయంగా కుల రాజ‌కీయాలను న‌డిపే బొత్స‌కు, కోల‌గ‌ట్లే కొన్ని సార్లు అడ్డుగా నిలిచారు. ఆ కోప‌తాపాలలో భాగంగానే బొత్స ఆయ‌న‌ను ఒంట‌రిని చేశారు. త‌న బంధువుల‌కు ప‌దువులు ఇప్పించుకోవ‌డంలో ముందుండే బొత్స‌కు కోల‌గ‌ట్ల లాంటి నాయ‌కుల‌తో విభేదాలు చాలానే ఉన్నాయి. అందుకే ఆయ‌న అశోక్ కు మ‌ద్ద‌తిచ్చి, ఆయ‌నకు అనుగుణంగా రాజ‌కీయాలు నెర‌పిన సంద‌ర్భాలే అనేకం.
ఇంకా చెప్పాలంటే......
విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాల్లో బొత్స తో విభేదించి పోరాడుతున్న ఏకైక వ్య‌క్తి కోల‌గ‌ట్ల‌. పూర్తి పేరు కోల‌గట్ల వీర‌భ‌ద్ర స్వామి. ప్ర‌స్తుతం ఈయ‌న ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లోనూ ఇండిపెంటెండ్ గా పోటీ చేసి తాను అనుకున్న‌ది సాధించుకున్నారు. 2009(కాంగ్రెస్ త‌ర‌ఫున‌), 2014 (వైసీపీ త‌ర‌ఫున‌) ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు. మ‌ళ్లీ  2019లో గెలిచారు. మొద‌ట నుంచి బొ త్స స‌హ‌కారం పార్టీలో లేక‌పోయినా కూడా జ‌గ‌న్ అండ‌గా కా స్త  నిలదొక్కుకున్నారు. జిల్లాలో అశోక్ కు లోపాయికారిగా మ‌ద్ద‌తు ఇచ్చే బొత్స కేవ‌లం కోల‌గ‌ట్ల‌పై కోపంతోనే, ఆయ‌న అనుకు న్న‌ది సాధించారు. బాహాటంగా అశోక్ కు మ‌ద్దతు ఇవ్వ‌క‌పోయినా, చాలా సంద‌ర్భాలో వివాదాల్లో మౌనంగా ఉంటూ ఆయ‌నకు అనుగుణంగా స‌మీక‌ర‌ణ‌లు మార్చి, రాజ‌కీయాలు చేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో! ఇప్పుడు కోల‌గ‌ట్ల‌ త‌న కుమార్తెకు టికెట్ ఇప్పించు కోవాల‌ని తాప‌త్రయ పడుతున్నారు. ఇందుకు బొత్స ద్వారా లాబీయింగ్ చేయా ల‌నుకుంటున్నారు. జ‌గ‌న్ ద‌గ్గ‌ర కూడా స‌న్నిహితంగానే ఉన్న‌ప్ప‌టికీ జిల్లా రాజ‌కీయాలు వ‌చ్చేట‌ప్పటికి బొత్స మాటే వేదం అయి న సంద‌ర్భాలున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత స‌న్నివేశాల నేప‌థ్యంలో బొ త్స, జ‌గ‌న్ కాస్త దూరం దూరం అన్న విధంగానే ఉ న్నారు. ఈ త‌రుణంలో త‌న మాట సీఎం ద‌గ్గ‌ర నెగ్గించుకోవాల‌న్న‌ది ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల తాప‌త్ర‌యం. ఇదే స‌మ‌యంలో బొత్స‌ను కూడా క‌లుపుకుని పోవాల‌ని యోచిస్తున్నార‌ని తెలుస్తోంది. అది సాధ్య‌మా కాదా అన్న‌దే ఇప్పుడిక చ‌ర్చ‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: