వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేసేది ఎక్కడో తెలుసా ?

VAMSI
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన ప్రతి ఎన్నికల్లో వైసీపీ తన హవా కొనసాగిస్తోంది. 2019 మార్చి నెల అసెంబ్లీ ఎన్నికల నుండి తీసుకుంటే పంచాయితీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లు ఇప్పుడు ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ లు ఇలా అన్నింటిలో వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బల పరిచిన అభ్యర్థులు విజయాన్ని సాధించారు. అయితే ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అయినా కూడా ప్రజలు జగన్ వైపే నిలబడి ఉన్నారు. ఈ విజయమే దానికి సాక్ష్యమని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ ఫలితాలకు సంబంధించి ఈ రోజు లైవ్ లో మాట్లాడిన మాటలు వైసీపీ కార్యకర్తలకు మాయిరున్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉన్నాయి.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నా వైపు ప్రజలున్నారని గర్వంగా చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక్క విషయం మాత్రం బాగా హైలైట్ అవుతోంది. ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో ఒక సంఘటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని తెలిసిందే. ఇక్కడ చాలా కాలంగా మాజీ సీఎం చంద్రాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ టీ సదుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కి చెందిన ఒక మహిళ కైవసం చేసుకుంది. ఇక్కడ పోలైన మొత్తం 1243 ఓట్లలో వైసీపీ అభ్యర్థి అశ్వినికి 1143 ఓట్లు దక్కాయి. టీడీపీ అభ్యర్ధికి కేవలం 70 ఓట్లతో సరిపెట్టుకున్నాడు.
ఒక యువతీ టీడీపీ కంచుకోటలో ఎంపీటీసీ గా గెలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ ఫలితంతో ఇక కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి చోటు లేదనే విషయం అర్ధమవుతోంది. కొంతమంది నాయకులైతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇక వేరే నియోజకవర్గం చూసుకుంటే బెటర్ అని అంటున్నారు. ఈ పరాజయాన్ని చంద్రబాబు ఎలా జీర్ణించుకుంటున్నాడో అర్ధం కావడం లేదు. ఎంతైనా మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి ఇలాంటివి చాలా సులభంగా భరిస్తూ ముందుకు వెళుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: