కేరాఫ్ బొత్స : అత‌డు ఎమ్మెల్యే టికెట్ వ‌ద్ద‌న్నాడు?

RATNA KISHORE
మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శృంగ‌వ‌ర‌పు కోటలో పాగా వేయాల‌న్న వ్యూహం బొత్స‌ది. కానీ త‌న‌కు టికెట్ వ‌ద్ద‌ని చెప్పాడు అల్లు డు  శ్రీ‌ను. అల్లుడు శ్రీ‌ను ఎవ‌రు అంటే ఆయ‌న సొంత మేన‌ల్లుడు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. రానున్న ఎన్నిక ల్లో కూడా ఆయ‌నే వ్యూహ‌క‌ర్త కానున్నాడు. బొత్స చేసే వ్యాపారాల్లోనూ, రాజ‌కీయాల్లోనూ బాగా ద‌గ్గ‌ర‌గా  అన్నీ తానై చూసుకునే ఆయ‌న, ఓ సంద‌ర్భంలో జ‌గ‌న్ దృష్టిలో ప‌డ్డాడు. అంతేకాదు బొత్స పెద్ద‌గా మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌ని బొబ్బిలి రాజ‌కీయాల్లోనూ చిన్న శ్రీ‌ను చ‌క్రం తిప్పాడ‌ని అం టారు. వాస్త‌వానికి బొత్స తో ప‌డ‌కే బొబ్బిలి రాజులు టీడీపీలో చేరిపోయారు. కానీ చిన్న శ్రీ‌ను మాత్రం బొబ్బిలిలో వైసీపీ ఫ్యాను బొ మ్మ‌కు ఓటు ప‌డాల‌న్న త‌ప‌న‌తో ప‌నిచేశారు. ఫ‌లితం మొన్న‌టి ఎన్నికల్లో 9/9 కొట్టారు. ఇదే విధంగా శ్రీ‌కాకుళం రాజ‌కీయంలోనూ బొత్స లానే ప్ర‌భాం చూపే నాయ‌కులు ఉన్నా, వారికి ఆ స్థాయిలో న‌మ్మిన బంట్లు లేరు. కా నీ బొత్స అనుకుంటే ఏం అయినా చేయ‌గ‌ల‌డు అన్న న‌మ్మ‌కాన్ని ఇచ్చింది మాత్రం చిన్న శ్రీ‌నే! ఇప్పుడు ఆయ‌న మ‌రింత కీల‌కం అయ్యారు. తాజాగా జెడ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి ల‌భించ‌నుండ‌డంతో విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాలే కాదు ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లోనూ బొ త్స‌కు మ‌రింత బ‌ల‌ప‌డే ఛాన్స్ వ‌చ్చింది.

 
ఇంకా చెప్పాలంటే........
విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాల్లో తిరుగులేని నేత‌గా బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు పేరుంది. ఆయ‌న వెనుక ఉంటూ మంత్రాంగం న‌డిపే వ్య‌క్తిగా చిన్న శ్రీ‌ను (పూర్తి పేరు మజ్జి శ్రీ‌నివాస‌ రావు)కు పేరుంది. పార్టీ గెలుపున‌కు సంబంధించి ఎంతో శ్ర‌మించాడ‌ని బొత్సతో పాటు జ‌గ‌న్ కూడా ఆయ‌న‌కో ప్ర‌త్యేక గుర్తింపు ఇస్తారు. బొత్స కార్య‌క‌లాపాల‌న్నింటి నీ వె న్నంటే ఉండి న‌డిపించ‌డంలో దిట్ట‌గా పేరుంది. విజ‌య‌న‌గ‌రం రాజుల ఇలాకాలో  త‌న‌దైన ముద్ర‌ను వేసుకుని రాజ‌కీయం చేసిన నాయ‌కుల్లో ఒక‌రు చిన్న శ్రీ‌ను. బొత్స హ‌ వాగా ఇంత‌గా న‌డిచినా, ఇంత‌గా పేరు తెచ్చుకున్నా అందుకు ఓ కార‌ణం ఆయ‌నే! తాజాగా జెడ్పీ పీఠం వ‌రించిన సంద‌ర్భంగా బొత్స మ‌నుషులంతా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఒకానొక ద‌శ‌లో బొత్స‌ను త‌ప్పించి రాజ‌కీయం చేయాల‌నుకున్న జ‌గ‌న్ కు అది సాధ్యం కాలేదు అంటే అందుకు కార‌ణం కూడా చిన్న శ్రీ‌ను లాంటి వ్య‌క్తులే.. ఓ అంచ‌నా ప్ర‌కారం బొత్స చేతిలో 40 మంది ఎమ్మెల్యేలున్నార‌ని టాక్ . వీళ్లంతా ఏక‌తాటిపై న‌డిచే విధంగా చేయాలంటే అందుకు మ‌ళ్లీ ప‌నిచేయాల్సింది చిన్న శ్రీ‌నే!

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: