బెజవాడ లో డ్రగ్స్ కీ రోల్ ఎవరిది...?

Gullapally Rajesh
విజయవాడ లో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. డ్రగ్స్ కి సంబంధించి ఇప్పుడు జాతీయ దర్యాప్తు బృందాలతో పాటుగా విజయవాడ పోలీసులు కూడా సీరియస్ గా ఫోకస్ చేసారు. విజయవాడ లో ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉంటాయి అనే దాని మీద అలాగే విజయవాడ లో డ్రగ్స్ కి సంబంధించి ఏ కాలేజీ లు కీలకంగా ఉన్నాయి అనే దాని మీద కూడా విజయవాడ పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేసారు. ఇక ఇదిలా ఉంటె కాసేపు క్రితం బెజవాడ కేంద్రం గా అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా పై పత్రికా ప్రకటన విడుదల చేసినా పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు... కీలక వ్యాఖ్యలు చేసారు.
చెన్నై కు  చెందిన గోవింద రాజు దుర్గా పూర్ణ వైశాలి ఆగస్టు 2020 న సత్యనారాయణ పురం లోని తన నివాసం పేరుతో   రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని వివరించారు. భార్య వైశాలి పేరుతో ఇంపోర్ట్ & ఎక్స్పోర్ట్  పేరుతో  కేంద్రం లో ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్  నుంచి లైసెన్సు తీసుకున్నారు సుధాకర్ అని వివరించారు. టాల్కం  పౌడర్  పేరుతో  గుజరాత్  లోని కందాహర్ పోర్టు కుపెద్ద మొత్తంలో వచ్చిన హెరాయిన్ ఢిల్లీకి తరలించేందుకు దిగుమతి చేసుకున్నారు అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ విజయవాడ లో ఉన్న సుధాకర్ భార్య  వైశాలి సంబంధించిన ఇంట్లో ఎటువంటి లావాదేవీలు జరగలేదు అని పేర్కొన్నారు. కేవలం వైశాలి ఇంటి అడ్రస్ పేరుతో లైసెన్స్ ఉన్నట్లు మాత్రమే గుర్తించాం అన్నారు. ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు అహ్మదాబాద్,  ఢిల్లీ, చెన్నై నగరాల్లో సోదాలు చేస్తున్నారు అన్నారు ఆయన. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన డీ ఆర్ ఐ చూసుకుంటుంది అని సీపీ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: