పాదయాత్ర డేట్ ప్రకటించిన షర్మిల... ఎక్కడ స్టార్ట్, ఎక్కడ ఎండ్ చెప్పిన షర్మిల

Gullapally Rajesh
తెలంగాణాలో వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతుంది. ఆమె ఏం చేస్తుంది ఏంటీ అనే దాని పై ఇప్పుడు కాస్త తెలంగాణా రాజకీయ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తనకంటూ ఇప్పుడు ఆమె ఒక స్పేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనే కామెంట్స్ వినపడుతున్నాయి. తెలంగాణాలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆమె ఇబ్బంది పడే అవకాశామే కనపడుతుంది. ఇక తాజాగా షర్మిల మీడియాతో మాట్లాడారు. చేవెళ్ల నుంచే నా పాదయాత్ర అని అధికారంగా ప్రకటించారు.
ప్రజా ప్రస్థానం పేరుతో అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర  చేస్తాను అని అధికారికంగా ఆమె ప్రకటించారు. చేవెళ్లలోనే ముగింపు ఉంటుంది  అని షర్మిల పేర్కొన్నారు. జిహెచ్ఎంసి మినహా అన్ని జిల్లాలు తాకేలా దాదాపు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుంది  అని ఆమె అన్నారు. వైఎస్ఆర్ సంక్షేమపాలన తేవడమే నా లక్ష్యం అని షర్మిల స్వయంగా ప్రకటించారు. పాదయాత్రలోను నిరుద్యోగ వారం లో భాగంగా మంగళవారం దీక్షలు కొనసాగుతాయి అని ఆమె పేర్కొన్నారు. ఏడేళ్ల పాలనలో 7 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.
3లక్షలమందికి రుణమాఫీ చేసి 36 లక్షల మందికి ఎగ్గొట్టారు అని విమర్శలు చేసారు. దళితులపై దాడులు 800 శాతం పెరిగాయి అని అన్నారు. మద్యం అమ్మకాలు, మహిళలపై దాడులు 300 శాతం పెరిగాయి అన్నారు. రాష్ట్రంలో మహిళలు చిన్నపిల్లలా మాన ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది అని ఆవేదన వ్యక్తం చేసారు. నాలుగు లక్షల కోట్లు అప్పులు తెచ్చారు, ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయి అని షర్మిల ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కెసిఆర్ కు చీమకుట్టినట్లు ఉండదు అన్నారు. పాదయాత్రలకు వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని  చెప్పారు. ప్రజల సమస్యలు వినడం, వాటి పరిష్కారం కనుక్కోవడమే తన పాదయాత్ర లక్ష్యం అన్నారు ఆమె. ఏడేళ్లలో అన్ని వర్గాలను మోసం చేసారు అని విమర్శలు చేసారు. కాంగ్రెస్ బీజేపీ లు కెసిఆర్ కు ఎలా అమ్ముడుపోయాయో వివరిస్తాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: