చిరంజీవి ఆలోచనలు తీసుకుంటాం: ఏపీ మంత్రి

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ లు విక్రయించడం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం పట్ల విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం చేసేది కరెక్ట్ కాదని సినిమా వాళ్ళు కూడా అనుకుంటున్నారు అని విపక్షాలు వ్యాఖ్యలు చేసాయి. తాజాగా సినీ పెద్దలతో ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నానీ భేటీ అయ్యారు. 2002 నుంచి సినిమా టికెట్లు ఆన్లైన్ లో విక్రయించాలని కేంద్రం చేసిన వివిధ ప్రయత్నాలు మా ప్రభుత్వం అధ్యయనం చేసింది అని మంత్రి ఆ తర్వాత మీడియాకు వివరించారు.
తెలుగు సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంది అని ఆయన అన్నారు. వారి భాధలను... తెలుసుకునే ప్రయత్నం చేశాం అని ఆయన వివరించారు. సినిమా నిర్మాణంలో నిర్మాతలు కోరుతున్న సదుపాయాలు గురించి కూడా తెలుసుకున్నాం అని చెప్పుకొచ్చారు. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విషయంలో థియేటర్ యజమానులు, నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ సభ్యులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అన్నారు. ఆన్లైన్ విధానంలో టికెట్ విక్రయాలకు అంతా ఆమోదం తెలిపారు అని ఆయన వివరించారు.
సగటు సినీ ప్రేక్షకులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండటంతో పాటు, పారదర్శకంగా ఉండేలా ఈ విధానం అమలు చేయాలని భావిస్తున్నాం అని మంత్రి మీడియాకు వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మాత్రమే ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాలను చేపడతాం అని స్పష్టం చేసారు. అందరికి అందుబాటులో వినోదం అన్నదే ఈ విధానంలో అమలు అవుతుంది అని అన్నారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలిస్తోంది అని తెలిపారు. బెనిఫిట్ షోల గురించి ఎవరూ అభ్యర్థన  చేయలేదు అన్నారు మంత్రి నానీ. చిరంజీవి నిన్న ప్రభుత్వం దృష్టికి తెచ్చిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం అని అన్నారు. ఏపీలో షూటింగ్ చేసేందుకు చాలా మంది సానుకూలంగా స్పందించారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: