బిజెపి ఎందుకు ఇలా జగన్ ను టార్గెట్ చేసినట్టు...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ విషయంలో బిజెపి గట్టిగానే ఫోకస్ చేసింది. ఏపీ ఆర్ధిక వ్యవస్తకు సంబంధించి భారీగా అప్పులు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉందనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. కేంద్ర ఆర్ధిక శాఖ ఎప్పటికప్పుడు ఏపీ నివేదికలను తెప్పించుకుని వార్నింగ్ లు ఇస్తూ వస్తుంది. ఇక ఏపీ బిజెపి నేతలు దీనిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా దీనిపై బిజెపి నేత లంకా దినకర్ కీలక వ్యాఖ్యలు చేసారు.
స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సింగల్ సోర్స్ - డబుల్ డెట్ అయితే, ఈఏపీ ద్వారా ప్రాపర్ డెట్ - బట్ నో యూజ్ అన్నట్టుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఈ ఏపీ రుణాల వ్యవహారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీరు అతివృష్టి మరియు అనావృష్టిలా ఉంది అని ఆయన కామెంట్ చేసారు.  స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూ. 21,500 కోట్ల రుణాలు నిభంధనలకు విరుద్దంగా సేకరించడం  లోపం కాగా, ఈఏపీ రుణాలు రూ. 960 కోట్లు సకాలంలో వినియోగించక పోవడం  లోపం అని మండిపడ్డారు.
బడ్జెట్ లో చూపిన ఆదాయంనే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆదాయం గా చూపి రుణాలు సేకరించగా, వివిధ ప్రాజెక్టుల కొసం సేకరించిన   ఈఏపీ రుణాలు సకాలంలో వినియోగించ లేదు అని ఆయన విమర్శించారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణాల పైన కేంద్ర ఆర్థిక శాఖ, కాలంతీరినా వినియొగించని ఈఏపీ రుణాల పైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తమ కార్యాచరణ ప్రారంభించాయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కొత్త అప్పులు తేవడం మరియు తెచ్చిన అప్పుల నిరుపయోగంగా చెయడం లో రాష్ట్ర ఆర్ధికశాఖ నిర్వహణ వైఫల్యం స్పష్టంగా ఉంది అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: