బ్రేకింగ్: బొత్స నోట రాజీనామా మాట...?

Gullapally Rajesh
ఎన్నికల ఫలితాలు లెక్కించాలని తీర్పు ఇచ్చిన రోజు నుంచి తెదేపాలో ఆక్రోశం, ఆందోళన మొదలైంది అని మంత్రి బొత్సా సత్యనారాయణ ఎద్దేవా చేసారు. ప్రజలు సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది అని బొత్సా స్పష్టం చేసారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయింది అన్నారు ఆయన. తెదేపాకు ప్రజల్లో మనుగడ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. తెదేపా విలువలు కాపాడు కోవాల్సిన పరిస్థితి ఉంది అని అన్నారు.
ఎన్నికల ఫలితాలతో  ఇప్పటికైనా తెదేపా బుద్ది తెచ్చుకోవాలి  అని బొత్సా సూచించారు. ఎన్నికలు బహిష్కరణ అంటే నామినేషన్లకు ముందే ఆ విషయాన్ని తెలియజేయాలి అని హితవు పలికారు. నామినేషన్లు వేశాక చేతకాక ఎన్నికలను  బహిష్కరిస్తామని చెప్పారు అని ఆయన విమర్శించారు. ప్రజలిచ్చిన తీర్పు స్పూర్తితో ప్రజల సేవకు సీఎం జగన్ పునరంకితమవుతారు అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా  సీఎం జగన్ అమలు చేస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు.
 ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేయడం సరైంది కాదు అన్నారు ఆయన. అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేయమనండి..నేనూ రాజీనామా చేస్తాను  అని అన్నారు. ఇద్దరూ రాజీనామా చేసి పోటీ చేసి ప్రజాబలం ఏమిటో తేల్చుకుందాం  అంటూ సవాల్ చేసారు. స్థాయి ని తగ్గించేలా తెదేపా నేతలు   మాటలు  మట్లాడవద్దు  అన్నారు బొత్సా. తెదేపా నేతలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు విమర్శించారు. చంద్రబాబు నాయుడిని చంపడానికి కొట్టడానికే ఆయన ఇంటికి  వైకాపా నేతలు వెళ్లామనడం సరికాదు అన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు శాశ్వత హక్కు ఇవ్వాలని సీఎం జగన్  నిర్ణయించారు అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి ఇంటిపై శాశ్వత హక్కు ఇవ్వాలని  సీఎం నిర్ణయించారు అని అన్నారు. దీనికోసం విధి విధానాలు రూపొందించాలని అధికారులను  సీఎం ఆదేశించారు  అని చెప్పారు. డిసెంబర్ లోపు 80వేల టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందిస్తాం అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: