పరిషత్ ఎన్నికల్లో జగన్ గెలుపు ఎలా ఉందో చెప్పిన రఘురామ...?

Gullapally Rajesh

ఎంపిటిసి, జెడ్పీటీసి ఎన్నికల ఫలితాలు ఎవరు పట్టించుకోలేదు అన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. తండ్రి దగ్గరకు వచ్చి ఒక కొడుకు నాన్న నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను అంటాడు అని... దానికి సంతోషించిన తండ్రి ఎంతమంది పాల్గొన్నారు అని అడిగితే నేను ఒక్కడినే అని సమాధానం ఇస్తాడు కొడుకు... అలా ఉన్నాయి ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు అన్నట్టు ఉందని ఆయన ఎద్దేవా చేసారు. తెలుగుగంగ ఫస్ట్ ఫేజ్ పూర్తి అయ్యింది రెండో ఫేజ్ పూర్తి కావలసి ఉంది గత ప్రభుత్వం హయాంలో పనులు బాగానే జరిగాయి అన్నారు ఆయన.
హంద్రి నీవా పనులు పూర్తిగా పడకేసాయి అని కామెంట్ చేసారు. గాలేరు నగరి కుడా పనులు జరగడం లేదు, 3 లేదా 4 వేలు కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది కానీ అస్సలు పట్టించుకోవడం లేదు అన్నారు ఆయన. రాయలసీమ ఎత్తి పోతల పధకం కంటే ముందే వెలిగొండ ను నిర్మించాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చారు. వెలిగొండ ను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు అని మండిపడ్డారు. ఎక్కడికక్కడే ఉన్నాయి ప్రాజెక్ట్స్ అన్నీ అంటూ... ఒక తట్ట మట్టి కుడా ఎత్తలేదు అన్ని ప్రాజెక్ట్స్ లో అంటూ ఆయన ఆరోపించారు.
అన్ని స్థానాలు ఇచ్చిన రాయలసీమ కు ఇదేనా  మనం చేసేది అంటూ నిలదీశారు. కొత్త ప్రాజెక్ట్స్ పక్కన పెట్టేసి ఇప్పటికే నిర్మాణం లో ఉన్న ప్రాజెక్ట్స్ నిర్మాణం పూర్తి చేయాలి అని డిమాండ్ చేసారు. 25 వేలు 30 వేళ కోట్ల తో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు.  రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు కు ఏమి చేశామో ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. దొంగ అప్పులు తెచ్చి పంచడం కాదు  గొప్ప  అని విమర్శలు చేసారు.  వాపు ను చూసి బలుపు అనుకోకుండా, మురిసిపోకుండా నిజమైన అభివృద్ధి పై దృష్టి పెట్టాలి  ప్రభుత్వం అని కోరారు. అభివృద్ధి లేకుండా నోటు కొట్టు ఓటు పట్టు వల్ల ఉపయోగం లేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: