సీఎం జ‌గ‌న్ ను ఫాలో అవుతున్న బీజేపీ సీఎం..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు తీసుకువ‌స్తున్న ప‌థ‌కాల‌ను, నిర్ణ‌యాల‌ను ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఫాలో అవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కేసీఆర్ తీసుకువ‌చ్చిన రైతు బంధు ప‌థ‌కాన్ని కేంద్రం పేర్లు మార్చి అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకువ‌స్తున్న ఆన్లైన్ టికెట్ విధానం నిర్న‌యంపై త‌మిళ‌నాడు ముఖ్య‌మ‌త్రి స్టాలిన్ ప్ర‌శంస‌లు కురిపిచారు. తాను కూడా త‌మ రాష్ట్రంలో ఈ విధానాన్ని అమ‌లు చేస్తాన‌ని స్టాలిన్ చెప్పాడు. ఇక జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన మ‌రో ప‌థకాన్ని బీజేపీ సీఎం త‌మ రాష్ట్రంలో కాపీ కొడుతున్నారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యంగా ఉండేందుకు రేష‌న్ కోసం క్యూ క‌ట్టే అవ‌స‌రం లేకుండా ఇంటికే వ‌చ్చి రేష‌న్ ను పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 

అయితే ఇదే విధానాన్ని త‌మ రాష్ట్రంలో కూడా అమలు చేయాల‌ని మ‌ధ్య ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌ధ్య ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ దినోత్స‌వంగా జ‌రుపుకునే న‌వంబ‌ర్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో 89 గిరిజ‌న బ్లాకుల్లో ఈ సేవ‌ల‌ను మొద‌ట‌గా అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ట్టు శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ప్ర‌క‌టించారు. గిరిజ‌న స్వ‌తంత్ర స‌మ‌ర‌యోదుల‌ను గౌర‌వించ‌డానికి గౌర‌వ్ దివ‌స్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు.

అయితే ఈ కార్య‌క్రామ‌లంనే శివ‌రాజ్ సింగ్ చౌహాన్ రేష‌న్ డోర్ డెలివ‌రీ విధానాన్ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి నుండి గిరిజ‌నులు ప్రత్యేకంగా ప‌నులు మానుకుని రేష‌న్ కోసం రేష‌న్ దుకాణాల వ‌ద్ద క్యూ క‌ట్టాల్సిన ప‌నిలేద‌ని శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇప్ప‌టి నుండి ఇంటి వ‌ద్దకే తాము రేష‌న్ డెలివ‌రీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీ ప్ర‌భుత్వం హ‌యాలో గిరిజ‌నుల‌కు ఎంతో ల‌బ్ది జ‌రిగింద‌ని సీఎం తెలిపారు. వాజ్ పేయి హ‌యాంలో గిరిజ‌నుల కోసం ఎన్నో కార్య‌క్రామాలు చేప‌ట్టార‌ని వెల్ల‌డించారు. గిరిజ‌న విద్యార్థుల కోసం కాంగ్రెస్ 200 లేదా 300 స్కాల‌ర్ షిప్ ఇస్తే తాము ప‌ద‌కొండు వంద‌లు ఇస్తున్నామ‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: