బ్రేకింగ్: తెలంగాణా డ్రగ్స్ లో ఇవాంకా ట్రంప్ పేరు...?

Sahithya
ఎక్సైజ్ విచారణ నివేదిక ను ఎందుకు ఈడీ అధికారులకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిలదీశారు. కెసిఆర్ విశ్వనగరం కి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటారు అని అయన కేంద్ర విచారణ సంస్థకు ఇవ్వము అని చెప్పారని కాని తాను పిటీషన్ వేయడంతోనే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుంది అన్నారు. అకుణ్ సబర్వాల్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది అని... డ్రగ్స్ కేసు విచారణలో వుండగానే ఆకున్ సబర్వాల్ నీ తప్పించారు అని ఈ సందర్భంగా రేవంత్ ఆరోపించారు.
బంజారాహిల్స్,మాదాపూర్..కొండాపూర్ వరకు పబ్బులు వ్యాప్తి చెందాయి అని ఆయన విమర్శించారు. విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్ గంజాయి వాడకం ఎక్కువైంది అని కేటీఆర్ కి బాధ్యత లేదా? పిల్లలు డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా అని ఆయన నిలదీశారు. కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు అని... ఎవరు నేర గాల్లు అనే చర్చ తర్వాత చేద్దాం అంటూ... ఇదే అమర వీరుల స్తూపము ముందు రెడీ. మా తండ్రి తాత ముత్తాత చరిత్ర  కూడా చర్చిద్దాం అంటూ సవాల్ చేసారు.
డ్రగ్స్ కేసు చర్చ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. మీ ఆస్తులు అడగడం లేదు... కేటీఆర్ చేస్తున్న సంతోషాల లో వాట అడగలేదు అంటూ రానా, రకుల్ ప్రీత్ సింగ్ నీ ఈడీ పిలిచింది అని వాళ్ళను తాను అంటుంటే కేటిఆర్ ఎందుకు కంగారు పడుతున్నాడు అంటూ ప్రశ్నించారు. కేసులు వేస్తం అని బెదిరిస్తున్నారు అంటూ కేటీఆర్ నీ స్థాయి పెద్దది అనుకుంటున్నావు అని మండిపడ్డారు. కేటీఆర్ నువ్వు ఎమ్మెల్యే కాకముందే అంటూ నీ అయ్య  నువ్వు మొదటి సరి ఎమ్మెల్యే గా గెలిచింది 100 ఓట్లతోనే అంటూ ఎద్దేవా చేసారు.  డ్రగ్ టెస్టు కు రా అని నేను అడిగానా నువ్వు అడిగావా అంటూ ఆయన ప్రశ్నించారు. నువ్వు చెప్పిన దాన్నే నేను స్వీకరించా అన్నారు. రాహుల్ గాంధీని రమ్మని చెప్పిన కేటీఆర్ ఇవాంక ట్రంప్ నీ కూడా రమ్మని అడుగుతారేమో కేటీఆర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: