బ్రేకింగ్: ఈనాడు లక్ష్యంగా జగన్ సంచలన ఆరోపణలు

Sahithya
పరిషత్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ సిఎం జగన్ నేడు తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా పై మాట్లాడారు. ఒకవైపు కోవిడ్‌తో డీల్‌ చేస్తున్నాం అంటూ... మరోవైపున రకరకాల దుష్ప్రచారాలు, రకరకాల అబద్ధాల మధ్య ఒకవైపు ప్రతిపక్షం. మరోవైపు ఇలా ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, టీవీ5... ఇటువంటి అన్యాయమైన మీడియా సంస్థలు అంటూ ఆయన ఈనాడు ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. అబద్ధాలను నిజం చేయాలని చెప్పి రకరకాల కుయుక్తులు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా..
కేవలం వాళ్లకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి కచ్చితంగా ముఖ్యమంత్రిని దింపేయాలని చెప్పి.. ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా అనే దుర్మార్గపు బుద్ధితో.. వాళ్ల మనిషిని ఆ సీట్లో ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా ఎక్కించాలని చెప్పి ఏకంగా చంద్రబాబునాయుడుగారిని భుజాన వేసుకుని నడుస్తున్న పత్రికలు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.  ఈరోజు కూడా ఆశ్చర్యకరమైన వార్త చూశాను అని... ఓడిపోయిన తర్వాత కనీసం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితిలో ఈనాడు పేపర్‌ ఉంది అని జగన్ వ్యాఖ్యానించారు.
‘పరిషత్‌ ఏకపక్షమే. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా సునాయాస గెలుపు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణతో పోటీ నామమాత్రం’.. అని రాసారు అని జగన్ మండిపడ్డారు. నిజంగా ఇది పేపరా? పేపర్‌కు పట్టిన పీడనా ఇదేమన్నా? ఇంత అన్యాయమైన పేపర్లు బహుశా  ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండవేమో అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఈ ఎన్నికల్లోనే కాదు... ఇంతకు ముందు నేను చెప్పా. 2019 ఎన్నికల్లో ఏ రకంగా 86 శాతం సీట్లతో మొదలైతే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే 88 శాతంతో మొదలైతే.. ఆ తర్వాత సర్పంచ్‌ ఎన్నికల్లో 80 శాతం పైచిలుకు పదవులతో ప్రయాణం అయితే.. ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికల్లో 99 శాతం, 100 శాతం కార్పొరేషన్లు గెలవడం అయితే.. దాని తర్వాత ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 86 శాతం, 98 శాతంతో ఏ రకంగా గెలుపు. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో ఇదంతా జరుగుతుంటే దాన్ని జీర్ణించుకోలేక ఈ రకమైన రాతలు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: