మూడు నెలలు ఆగండి చాలు : అభిషేక్

 మూడు నెలలు ఆగండి చాలు :  అభిషేక్
"మూడు నెలలు ఆగండిచాలు... దేశ్ రాజకీయాల్లో పలు మార్పులు సంభవిస్తాయి. ప్రస్తుతం మాజీ కేంద్ర మంత్రి బాబులాల్ సుప్రియో ఒక్కరే తృణముల్ కాంగ్రెస్ లో చేరారు. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులుంటాయి. ఆట ఇంకా మొదలవనే లేదు " అని తృణముల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు.
పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2024లో దేశాన్ని మారుస్తారని, ఆ సత్తా ఆమె ఒక్కరికే ఉందని ఆయన అన్నారు. దేశ ప్రజలను ప్రభావితం చేసే నేర్పు, ఢిల్లీ రాజకీయాలను మార్చగలిగే సామర్థ్యం భారత్ లో ప్రస్తుతం ఆమెకు మాత్రమే ఉన్నాయని అభిషేక్ బెనర్జీ తెలిపారు. భవానీ పూర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హిందీ వ్యాపార వేత్తలతో సమావేశమయ్యారు. తన ప్రసంగం అంతా బెంగాలీలో కాకుండా ఆద్యంతం హిందీలోనే ప్రసంగించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో దాదాగిరికి తావులేదన్నారు. ఎవరైనా, ఎటువంటి వారినయినా  దుందుడుకు చర్యలకు పాల్పడితే ఉపేక్షించేేది లేదని అభిషేక్ ప్రకటించారు. ఎవరైనా తన పేరు చెపితే, తాను తెలుసుని చెపితే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని వ్యాపార వేత్తలను కోరారు.  వారిని తాను దూరం పెడతానని  అభిషేక్ బెనర్జీ వ్యాపారులకు హామి ఇచ్చారు. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.  ఇంగ్లీషు అక్షరాలలో బి అంటే భవానీపూర్ మాత్ర కాదని, భారత్ అని  అభిషేక్ బెనర్జీ తెలిపారు.  ఈ దఫా మీరు వేసే ఓటు సామాన్యమైనది కాదని అన్నారు.  ఉప ఎన్నిక గెలుపు, ఓటములపై యావత్  ప్రపంచం దృష్టి సారించి ఉందని పేర్కొన్నారు. మమతా బెనర్జీని అత్యధిక మెజార్జీతో గెలిపించడం ద్వారా యావత్ భారతావనికి ఒక సందేశం పంపాలని ఆయన కోరారు. గుజరాత్ కు చెందిన పలువురు వ్యాపార వేత్తలు తనను ఇటీవల  కలిశారని, అక్కడ జరుగుతున్న ఆరాచక పాలనను వివరించారని చెప్పారు. మీరు కూడా గుజరాత్ లోని వ్యాపారులను అడగంటి అక్కడ ఏం జరుగుతోందో తెలుస్తుంది అని వ్యాపారవేత్తలను అభిషేక కోరారు.
అంతకు ముందు అభిషేక్ బెెనర్జీ  తన పార్టీ సహచరులతో కలసి శరత్ బోస్ రోడ్డులోని లక్ష్మీ నారాయణ మందిరంలో పూజలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: