ప్రపంచ సైన్యం ఎంత .. తాలిబన్ బ్రతుకెంత .. ఆఫ్ఘన్ పాపం అందరిదీ ..

Chandrasekhar Reddy
ఆఫ్ఘన్ లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఒకపక్క భయంకరమైన ఆంక్షలు మరోపక్క ఆహార కొరత తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచం దీనిని చోద్యం చూస్తున్నట్టు చూస్తుంది తప్ప మరేమీ చేయలేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. తాలిబన్ల సంఖ్య ఎంత, ప్రపంచ దేశాల సైన్యం ఎంత అనే లెక్కలు చెప్పాల్సిన లేక గుర్తు చేయాల్సిన అవసరం రావడం శోచనీయం. మేము మారాము అని చెప్పుకుంటూనే తాలిబన్లు ఇంకా మహిళలపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు తాలిబన్ల వెనుక చైనా, పాక్ ప్రత్యక్షంగానే ఉన్నట్టు ప్రపంచానికి తెలిసింది. అయితే ప్రపంచ సైన్యం ఐక్యరాజ్యసమితి ఉపయోగించి ఈ స్థితి నుండి ఆఫ్ఘన్ ప్రజలను రక్షించ వచ్చు. అలాంటివి ఏమి జరగకపోవడం చూస్తుంటే అమెరికా బయపడినట్టే తాలిబన్ లకు ప్రపంచ దేశాలు కూడా బయపడుతున్నట్టే కదా!
ఇప్పటి ఆఫ్ఘన్ ప్రజల బాధలకు ప్రపంచ దేశాలు అన్నీ కారణం అంటుంది సమసమాజం. అది నిజమే ఇంతమంది ఉండగా ఒక తీవ్రవాద సంస్థ ఆఫ్ఘన్ ను ఆక్రమించడం, వారికంటూ ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి మొదటే అడ్డుకట్ట వేయడం ప్రారంభించి ఉన్నట్టయితే నేడు ఆఫ్ఘన్ ప్రజల కు ఇలాంటి బాధలు ఉండేవికావు. ఒకవేళ కనీసం ఆఫ్ఘన్ ప్రజలు స్వేచ్ఛగా తమకు ఇష్టమైన దేశానికీ వెళ్లిపోవచ్చు అనే అంశం ఉన్నా కూడా కాస్త మెరుగ్గా ఉండేది. ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేకపోవడం శోచనీయం. ఆఫ్ఘన్ దేశీయుల పరిస్థితి మార్పు ప్రపంచ దేశాల సైన్యం కల్పించుకుంటేనే మారుతుంది. లేదంటే ఇలా ఎన్నాళ్ళు, ఈ లోపు తాలిబన్ లు వీళ్ళను మానవ బాంబులుగా మార్చేసుకుంటే పరిస్థితి ఏమిటి అనేది కూడా ఇతరదేశాల ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే ఆఫ్ఘన్ లో ప్రపంచంలోని తీవ్రవాద సంస్థలన్నీ ఒక్క చోట చేరి పండగ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా ఒకందుకు మంచిదే, యదవలు అంతా ఒక్కచోటే దొరికారు, అందరిని కలిసి ఏసేస్తే అనే ఆలోచన ఇన్ని దేశాలు, ఇంత సైన్యం ఎందుకు ధైర్యం చేయలేకపోతోంది..! అనేది ఆలోచించాల్సిన సందర్భం. సమసమాజంలో మృగాలు తిరుగుతూ పసిపిల్లలపై విరుచుకు పడితే వారిని వెతికి మరీ ఉరి వేస్తున్నాం మరి అలాంటి వారు ఉన్న దేశమే తయారైతే ప్రపంచం పరిస్థితి ఏమిటో ఊహించగలమా! అలాంటి దేశం ఉండాలా .. నాశనం చేయాలా అనేది ఆయా దేశాల లో కలగాల్సిన కనీస ఆలోచన. ఇటువంటి వారిని ఉపేక్షించడం ప్రపంచ శాంతికి మంచిది కాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: