హెచ్చరిక : ఇస్లామిక్ భావజాల వ్యాప్తి .. భారత్ లోను ..

Chandrasekhar Reddy
తాలిబన్లు ఆఫ్ఘన్ ఆక్రమించడంతో ఇస్లామిక్ భావజాలానికి ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసినట్టు అయ్యింది. ఇది ఇంతటితో ఆగదని, ప్రపంచ వ్యాప్తంగా తమ భావజాలాన్ని సామజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసి తద్వారా తమ సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని చాప కింద నీరులా వీరు ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించినట్టు ఆయా దేశాల నిఘా వ్యవస్థలు వారివారి దేశాలకు హెచ్చరికలు జారీచేశాయి. దీనిప్రకారం ముష్కరులు సామజిక మాద్యమాలలో ఉండే యువతను లక్ష్యంగా చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలను ఆకర్షించి వారితో వారి భావజాలంపై చర్చించి తద్వారా వారిని తమవైపు తిప్పుకొని చివరికి వారిని తమలో ఒకరిగా చేర్చుకుంటారు. పురుషులైతే తీవ్రవాదులుగా మార్చబడతారు, మహిళలైతే ముష్కరుల సెక్స్ బానిసలుగా మార్చబడతారు అనేది ఈ హెచ్చరికలలో ప్రధానాంశం.
దీనిని భారతీయులు ముఖ్యంగా యువత గమనిస్తూ సామజిక మాధ్యమాలలో అటువంటి భావజాలం తో ఎవరైనా తమతో చర్చిస్తే తక్షణమే అధికారులు ఇచ్చిన సమాచారం(01124368800) మేరకు స్పందించాల్సి ఉందని ఎన్.ఐ.ఏ. స్పష్టం చేసింది. వీరి ప్రధాన లక్ష్యం ప్రపంచ మంతా తాలిబన్ భావజాల వ్యాప్తి చేయడం మాత్రమే. దానిని ప్రోత్సహించడానికి వారిని ఆయుధంగా ఉన్నది సామజిక మాధ్యమాలు. వీటి ద్వారా అమ్మాయిల పేర్లతో అబ్బాయిలతో అలాగే అబ్బాయిల పేర్లతో అమ్మాయిలతో చాట్ చేస్తూ మెల్లిగా తమవైపు మళ్లించుకుంటారని అధికారులు తెలిపారు. ఇలాంటి దాడులు సామజిక మాధ్యమాల వేదికగా రానున్న రోజులలో తీవ్రంగా ఉండబోతున్నాయని వారు తెలిపారు. పొరపాటున ఎవరైనా వీటికి ఆకర్షితులైతే తరువాత చేయడానికి ఏమి ఉండబోదని వారు హెచ్చరిస్తున్నారు.
దాదాపు తాలిబన్లు ఆఫ్ఘన్ ఆక్రమణ కూడా ఇదే భావజాలం తో సామజిక మాధ్యమాలలో తీసుకురావడంతోనే సులభంగా సాధించినట్టు తెలుస్తుంది. అదే తరహాలో ఆయా దేశాలపై ఇటువంటి దాడులు తీవ్రంగా జరుగుతాయని, అవి జరిగినట్టు కూడా ఎవరికీ తెలియనంత నిశబ్దంగా జరిగిపోతుంటాయని అందుకే అప్రమత్తతతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే 37 కేసులు ఇటువంటి నేపథ్యంలో నమోదు చేసినట్టు తెలిపారు అధికారులు. ఇస్లామిక్ భావజాలంతో ఎవరైనా సామజిక మాధ్యమాలలో చర్చించినట్టు గమయించగానే వారితో వాదనలు చేయకుండా వెంటనే అధికారులకు పైన తెలిపిన నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇప్పటికే దేశంలో పలు చోట్ల ఈ భావజాలం కలిగిన అనేక మందిని అదుపులోకి తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. వీరంతా తీవ్రవాద ప్రేరేపిత దేశాలలో కఠిన శిక్షణ తీసుకోని వచ్చినట్టు వారు తెలిపారు. యువతపై మరో దాడి సిద్ధంగా ఉంది, తస్మాత్ జాగర్త!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: