డ్రగ్స్ వాడ: బెజవాడ లింకులు ఎక్కడివి...? ఎవరి కంపెనీకి వస్తున్నట్టు...?

Sahithya
అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా లో బెజవాడ పేరు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. గుజరాత్ ముంద్రా పోర్టులో 2,988 కే.జి ముడిసరకు గల హెరాయిన్ పట్టుకోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటీ అనేది అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఆఫ్గాన్ నుంచి ఇండియాకు రెండు కంటైనర్లలో వచ్చిన హెరాయన్ ను విజయవాడకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. కాందహార్ నుంచి టాల్కం పౌడర్ పేరిట కంటెనర్లలో రవాణా చేస్తున్నారని వెల్లడి అయింది. డెలివరీ అడ్రస్ లో విజయవాడ సత్యనారాయణ పురం చిరునామా ఉందని విచారణలో తేలింది.
ఆషీ ట్రేడింగ్స్ పేరుతో విజయవాడ సత్యనారాయణ పురంలో రిజస్టర్ అయిన కంపెనీకి డ్రగ్స్ తరలిస్తున్నారని గుర్తించారు. ఏడాది క్రితం గోవింద రాజు పేరుతో ఈ కంపెనీ రిజిస్టర్ అయిందని గుర్తించారు. రిజిస్ట్రేషన్ వివరాల్లో చెన్నైలో నివాసం ఉంటున్న సుదాకర్‌ అనే మరో వ్యక్తి ఫోన్ నెంబర్  ఉందని విచారణలో తేలింది. హెరాయిన్ పట్టుకున్న తరవాత స్వీచాఫ్ అయినట్టుగా తెలిసింది. కూపీలాగుతున్న డిఆర్ ఐ, నార్కొటిక్స్ అధికారులు... త్వరలోనే కొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
మూడు రోజుల క్రితం గోవిందరాజు, అతని భార్య ను చెన్నై లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవిందరాజు నివాసంలో నిన్న సోదాలు చేసారు. అత్యంత రహస్యం గా దర్యాప్తు జరుగుతుంది. ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు విజయవాడ పోలీసులు చాలా సీరియస్ గా దృష్టి సారించారు. ప్రముఖ కాలేజీ ల విషయంలో కొన్ని రోజులుగా తల్లి తండ్రులు కూడా కంగారులో ఉన్నారనే ప్రచారం మొన్నామధ్య జరిగింది. ఇక డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పుడు కొన్ని కొన్ని పరిణామాలు ఇటు హైదరాబాద్ లో కూడా కలవరపెడుతున్నాయి. హైదరాబాద్ డ్రగ్స్ కేసుకి సంబంధించి కొందరు సినీ ప్రముఖులను కూడా విచారిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు విజయవాడ తో హైదరాబాద్ వాళ్లకు లింక్ లు ఉన్నాయా అనే దాని మీద కూడా కూపీ లాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: