చిత్తూర్ .. నాడు టీడీపీ కోట .. నేడు వైసీపీకి బాసట ..

Chandrasekhar Reddy
చిత్తూర్ ఇది ఒకప్పటి టీడీపీ కంచుకోట. ఆ పార్టీ పెట్టిన పెద్దాయన పుట్టిన జిల్లా. దానితో ఆ ప్రభావం ఆయన ఉన్నంత వరకు ఎలాగైనా ఉంది. అనంతరం బాబు దానిని తన కంచు కోటగా తీర్చిదిద్దుకోగలిగారు. కానీ, ప్రస్తుతం ఆ విషయం మారిపోయింది. తాజా ప్రాంతీయ ఎన్నికల ఫలితాలలో కూడా ఈ విషయం బట్టబయలు అయ్యింది. ఏపీలో ఉన్న 25 అసెంబ్లీ స్థానాలలో ఒకటైన చిత్తూర్ ను గత సాధారణ ఎన్నికలలో రాష్ట్ర అధికార వైసీపీ సొంత చేసుకుంది. చిత్తూర్ లో అసెంబ్లీ చంద్రగిరి, నగిరి, గంగాధర నెల్లూరు, చిత్తూర్, పూతలపట్టు, పలమనుర్, కుప్పం స్థానాలు ఉన్నాయి. చిత్తూర్ ఏర్పడినప్పటి నుండి కేవలం కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మాత్రమే ఇక్కడ గెలవగలిగాయి.
ఎప్పుడూ కాంగ్రెస్ ఆదీనంలో ఉన్న ఈ స్థానం ఒక్కసారి ఎన్టీఆర్ పార్టీ తో టీడీపీ సొంతం అయిపోయింది. అప్పటి నుండి టీడీపీ కి కంచు కోటగా చెప్పుకుంటుంది ఆ పార్టీ. ఎప్పుడు గెలుస్తుండటం తప్ప పెద్దగా అభివృద్ధి కి నోచుకోకపోవడంతో 2019లో వైసీపీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల వద్దకే అన్నీ పథకాల ఫలితాలు చేరుతుండటంతో ఈ స్థానం లో వైసీపీ బలంగా స్థిరపడిందనే చెప్పొచ్చు. ప్రధాన ఎన్నికల నుండి ఇప్పటి వరకు జరిగిన స్థానిక ఎన్నికల వరకు వైసీపీ తప్ప మరే పార్టీ ఇక్కడ మళ్ళీ నిరూపించుకోలేక పోయింది. తాజా జడ్పీటీసీ, ఎంపీటీసీ లలో కూడా దాదాపు అన్ని స్థానాలు వైసీపీ పార్టీ సొంతం చేసుకోవడం ఇందుకో ఉదాహరణ.  
ఇక కాంగ్రెస్ దేశంలోనే కనిపించకుండా పోతుంది, అటు తెలంగాణ ఇవ్వడంతో అక్కడ ఇక్కడ కూడా ఆ పార్టీ కనిపించకుండా పోయింది. పిల్ల కాంగ్రెస్ అనే పేరు వైసీపీ కి ఉన్నప్పటికీ పరిపాలనలో ప్రజలకు దగ్గరై ఆ పేరు  నుండి బయటకు వచ్చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఎన్నిక తెరపైకి వచ్చినప్పటికీ విపక్షాలకు డిపాజిట్ కూడా లేకుండా క్లీన్ స్వీప్ చేస్తుంది.  టీడీపీ, కాంగ్రెస్ కనుమరుగైనట్టే తెలుస్తుంది. ఇక బీజేపీ తెలంగాణాలో ఒక స్థానం సాధించడంతో ఏపీలో కూడా తనవంతు పోరాటం చేస్తుంది. అయినా ఎక్కడా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఎన్ని పార్టీలు వచ్చినా కూడా మరో రెండు దశాబ్దాలు కనీసం వైసీపీ అధికారం దక్కించుకుంటుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: