తిరుపతి .. వైసీపీ సొంతం ..

Chandrasekhar Reddy
ఆంధ్రలోని అసెంబ్లీ స్థానాలలో తిరుపతి ఒకటి. చిత్తూరు జిల్లాలో ఉన్న 14 స్థానాలలో ఇది కూడా ఒక స్థానం. ప్రస్తుతం అధికార పార్టీ గత ఉపఎన్నికలో మరోసారి గెలిచింది. సాధారణ ఎన్నికలలో గెలిచినప్పటికీ, ఆ స్థానంలో ఉన్న నేత మృతి చెందటంతో ఉపఎన్నిక వచ్చింది. దానిని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార వైసీపీ పార్టీ భారీ మెజారిటీ తో తన అభ్యర్థిని గెలిపించుకుంది. అధికారంలోకి వచ్చిన రోజు నుండే చెప్పిన మేనిఫెస్టో ను చెప్పినట్టు అమలు చేస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటికే తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమాలతో వైసీపీ ముందుకు వెళ్తుంది. దీనితో తిరుపతి ఉపఎన్నికలో కూడా విపక్షాలకు డిఫాజిట్స్ కూడా లేకుండా గెలిచింది.
తిరుపతిలో ఆరు విధాన సభ సీట్లు ఉన్నాయి. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరు పేట(నెల్లూరు), వేంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు(చిత్తూర్). తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని కావడంతో అక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతూనే ఉంది. దీనితో తిరుపతి రురల్ మరియు తిరుపతి అర్బన్ గా పరిపాలనా సౌలభ్యం కోసం విభజించారు. 1955లో తిరుపతి ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు అనేక పార్టీలు ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఆధ్యాత్మిక రాజధాని కావడంతో ఒక వర్గం వారి స్థానంగా పేరు ముద్ర పడినప్పటికీ, దాని నుండి త్వరగానే బయట పడిందనే చెప్పాలి. కేవలం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రధానంగా ఈ స్థానాన్ని గెలుచుకున్నాయి. అనంతరం 2009లో పార్టీ పెట్టిన చిరంజీవి ఇక్కడి నుండి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం వైసీపీ, టీడీపీ, టీడీపీ, వైసీపీ పార్టీలు ఆయా ఎన్నికలలో ఈ స్థానాన్ని గెలుచుకున్నాయి.
పట్టణ ప్రాంతం కాబట్టి ఎప్పుడు ఓటింగ్ శాతం 45 నుండి 60 మధ్య మాత్రమే ఉంటుంది. తాజా ఉపఎన్నిక లో కూడా ఇదే స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం జరిగింది. ఈ ఎన్నికలో గెలవడానికి అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అధికార వైసీపీ తమ అభ్యర్థిని  గెలిపించుకుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతంలో కూడా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాల ఫలితాలు ప్రజలకు అందాయని, అందుకే విజయం నల్లేరు మీద నడక మాదిరి సులభం అయ్యిందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఎన్నికలలో ప్రచారంలో మాత్రం ఏ పార్టీ వెనక్కి తగ్గలేదు. ప్రచారంలో బీజేపీ, టీడీపీ, జనసేన లు తమ తమ ప్రచారం చేసి చివరి వరకు పోరాడాయి. అయినా ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ నిరూపించుకుని గెలిచింది. వచ్చే ఎన్నికలలో కూడా ఇదే ఫలితాలు రానున్నాయనేది నిపుణుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: