బైడెన్ చాలా మంచి పని చేశారట.. ఇమ్రాన్ షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.  ఆయుధాలు చేతపట్టి ప్రజాస్వామ్యాన్ని నేలకేసి కొట్టి..  ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యాన్ని చేపట్టారు తాలిబాన్లు. మరోసారి అరాచక పాలన కు తెర లేపారు. ఓవైపు మహిళలకు సముచిత గౌరవం కల్పిస్తామని ప్రజలను బానిసలుగా చూడ బోము అంటూ స్టేట్మెంట్లు ఇస్తూనే..  కుక్క తోక వంకర అన్న విధంగా ఎప్పటి లాగానే తమ వైఖరిని మార్చు కోకుండా ప్రజల పట్ల దారుణం గా వ్యవహరిస్తున్నారు తాలిబన్లు. దీంతో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరూ తాలిబన్ల పాలనలో చిత్ర హింసలకు గురి అవుతున్నారు అని చెప్పాలి.

 అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఇంతటి దారుణ పరిస్థితి రావడానికి అటు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న నిర్ణయమే కారణం. ఒకప్పుడు తాలిబన్ల అరాచకాలను అణిచివేయడానికి అమెరికా సైన్యం  ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి అక్కడ తాలిబన్ల పై దండెత్తింది. దీంతో తాలిబన్లు కాస్త ప్రాణభయం తో పారి పోయి దాక్కున్నారు. ఇక ఇటీవల 21 ఏళ్ల తర్వాత తమ సైన్యాన్ని ఉపసంహరించు కుంటున్నట్లు బైడెన్ ప్రకటించడం సంచలనం గా మారింది. ఇక అమెరికా సైన్యం ఉపసంహరించు కోవడం మొదలు పెట్టగానే తాలిబన్లు మళ్లీ అరాచకాలు సృష్టించి ఆఫ్ఘనిస్థాన్లో ఆధిపత్యాన్ని చేపట్టారు.

 దీంతో ఇక అంతర్జాతీయ సమాజం మొత్తం బైడెన్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కానీ ఇటీవలే పాకిస్థాన్ ప్రధాని తాలిబన్ మద్దతు దారుడు ఇమ్రాన్ ఖాన్ మాత్రం బైడెన్ నిర్ణయం సరైనది అంటూ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సమాజం బైడెన్ ను అన్యాయంగా నిందిస్తుంది అంటూ ఇటీవల రష్యాకు చెందిన ఒక న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకొని మంచి పని చేసిన  బైడెన్ ఆఫ్ఘనిస్తాన్లో సంక్షోభం ఏర్పడకుండా బైడెన్ సరైన వ్యూహాలను అమలు చేయాలి అంటూ ఇమ్రాన్ ఖాన్ కోరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: