విజీన‌గ‌రం వార్త : తెలుగు దేశానికి బోణీలే లేవు !

RATNA KISHORE
31 జెడ్పీటీసీ స్థానాలున్న విజ‌య‌న‌గ‌రంలో ఏ ఒక్క‌టీ గెలుచుకోలేక‌పోవ‌డం వెనుక నిరాశ ఎంత‌? నిరాస‌క్తి ఎంత‌?

తెలుగు దేశం పార్టీకి కొత్త శ‌క్తి ఇచ్చేవారు కావాలి. కుర్రాడు జ‌గ‌న్ సీఎం అయ్యాక లోకేశ్ కూడా యాక్టివ్ అయ్యారు. ఉన్నంత‌లో ప్ర‌జా ఉద్యమాలు ప్ర‌భావ శీల‌కంగా చేసేందు కు శ‌క్తి కూడ‌దీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఉత్తరాంధ్ర కంచుకోట‌గా నిలిచిన విజ‌య న‌గ‌రంలో ఏ మాత్రం చిన‌బాబు ప్ర‌భావం లేద‌న్న‌ది నిజం. ఆ మాట‌కు వ‌స్తే చంద్ర‌బా బు స‌రిగా ఈ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించ‌క‌పోవ‌డంతోనే జ‌గన్ పార్టీ పుంజుకుంటోంద‌ని కొంద‌రి మాట. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఒక‌ప్పుడు విజ‌య‌నగ‌రం జిల్లాలో తెలుగుదేశం పా ర్టీకి తిరుగు అన్న‌ది లేదు. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను ఇప్ప‌టి వాటితో బేరీజు వేయ‌లేం. మామూలు స్థాయి నుంచి ఎదిగిన నేత‌లంతా ఇప్పుడు పార్టీ సేవ‌లో త‌రించ‌డం లేదు. కొన్ని కార‌ణాల రీత్యా  వైసీపీ ఆడుతున్న పొలిటిక‌ల్ డ్రామాలో టీడీపీ నిరంత‌రం చిక్కుకుపోతూనే ఉంది కానీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొన లేక‌పోతోంది.
ఇంకా చెప్పాలంటే..........
జ‌గ‌న్ ప్ర‌భుత్వంను ఎప్ప‌టిక‌ప్పుడు ఇర‌కాటంలో ఉంచే ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. కార‌ణం ఉన్నా, లేకున్నా విమ‌ర్శ‌లు మా త్రం త‌ప్ప‌క ఉంటాయి ఆ పార్టీ త‌ర‌ఫు నుంచి.! సుదీర్ఘ రాజ‌కీయా అనుభ‌వం ఉన్న నేత‌గా చంద్ర‌బాబుకు పేరుండ‌డంతో ఆయ‌న స్థాయిలో విమ‌ర్శ‌లున్నా ఎవ్వ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు కానీ కొన్ని సార్లు ఆయ‌న కూడా స్థాయి మ‌రిచి మాట్లాడుతున్నారన్న ఆరోప‌ణ‌లూ, అభియోగాలూ ఉన్నాయి. దీంతో పెద్దాయ‌న జోలికి వైసీపీ పోకూడ‌ద‌నుకుంటున్నా పోక త‌ప్ప‌డం లేదు. కొన్ని సార్లు నిర్హేతుక విమ‌ర్శ‌ల‌తో చంద్ర‌బాబు మ‌నుషులు అప‌హాస్యం పాల‌వుతున్నారు కూడా! ఏదేమైన‌ప్ప‌టికీ తెలుగు దేశం పార్టీ మును ప‌టి ప్రాభ‌వాన్ని పొందేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలేవీ స‌ఫ‌లీకృతం కావ‌డం లేదు అన్న‌ది వాస్త‌వం.
తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కూ డా ఇదే రుజువు అయింది. స్థానిక  ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భంజనంలో జ‌నం తీర్పు వైసీపీకి అనుకూ లం అయి ఉంది. దీంతో విజయ న‌గ‌రం జిల్లా వ్యాప్తంగా ఒక్క‌టంటే ఒక్క జెడ్పీటీసీ ఫ‌లితం కూడా త‌న ఖాతాలో వేసుకోలేక పో యింది. ఈ స్థితికి కార‌ణం ఎవ‌రు ?  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: