ఆ తమ్ముళ్ళు జారిపోయేలా ఉన్నారుగా!

M N Amaleswara rao
రాజకీయాల్లో గెలుపోటములు సహజమే....అలా అని ఎప్పుడూ ఓటములే వస్తే పార్టీలకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకసారి కాకపోయినా మరొకసారి గెలుపు రుచి చూస్తే కాస్త నాయకులకు ఊరట ఉంటుంది. కానీ ఎప్పుడు ఓటమే అంటే నాయకులకు కష్టమే. అలాంటప్పుడు నాయకులు ఆ పార్టీలో ఎక్కువ కాలం ఉండటానికి ఇష్టపడరు. ముఖ్యంగా జంపింగ్‌లు అలవాటు ఉండే నాయకులు అసలు ఆగరు.
ఇప్పుడు ఏపీలో టి‌డి‌పిలో ఉన్న కొందరు నాయకులు అదే బాటలోనే ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే వరుసపెట్టి టి‌డి‌పికి భారీ ఓటములు ఎదురవుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల దగ్గర నుంచి చూసుకుంటే...తాజాగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల వరకు అదే పరిస్తితి. ఒకసారి కాదంటే మరొకసారైనా పార్టీ గెలుపు రుచి చూడటం లేదు. పైగా జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు విమర్శలు మొదలుపెట్టేశారు. అసలు జగన్ పని అయిపోయిందని, ఇక వైసీపీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుగు తమ్ముళ్ళు హడావిడి చేసేస్తున్నారు.
కానీ వాళ్ళ హడావిడికి తగ్గట్టుగా పరిస్తితులు ఉండటం లేదు. ప్రతిసారి టి‌డి‌పికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ దాదాపు 80 శాతం పైనే స్థానాలు గెలుచుకుంది. అటు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసేసింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో వైసీపీ గెలిచింది. ఇప్పుడు ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది...టి‌డి‌పి అడ్రెస్ లేకుండా పోయింది.
మరి ఇలా వరుస ఓటములు ఎదురవుతుండటంతో కొందరు తమ్ముళ్ళు తమ రాజకీయ భవిష్యత్‌పై బాగే బెంగపెట్టుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ నేతలు బాగా భయపడుతున్నారు. అక్కడ వైసీపీ హవా స్పష్టంగా కొనసాగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ పార్టీకి భవిష్యత్ కష్టమని తమ్ముళ్ళు భావిస్తున్నారు. అందుకే కొందరు తమ్ముళ్ళు జంపింగ్‌లకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే చాలామంది నాయకులు టి‌డి‌పిని వీడారు. మరికొందరు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫలితాలు చూశాక మరికొందరు తమ్ముళ్ళు  జారిపోవడానికి చూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: