రియాలిటీ ఇదేనా...కళ్ళు మూసుకుంటే కష్టమేనా!

M N Amaleswara rao
ఉత్తరాంధ్రలో ఫ్యాన్ హవా...కోస్తాలో వైసీపీ ప్రభంజనం....రాయలసీమలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్...ఇదే ప్రస్తుతం ఏపీ మీడియాల్లో కనిపించే వార్తలు...ఎందుకంటే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో అధికార వైసీపీ ఆధిక్యం కొనసాగింది. వన్‌సైడ్‌గా వైసీపీ విజయాలు సాధించింది. జగన్ దెబ్బకు చంద్రబాబుకు చక్కలు కనిపించాయి. అసలు రాష్ట్రంలో సైకిల్ చిత్తు అయింది....జనసేన అడ్రెస్ లేదు...మిగిలిన పార్టీలు ఉనికి కూడా చాటుకోలేదు.
అంటే ఏ స్థాయిలో వైసీపీ హవా కొనసాగిందో అర్ధమవుతుంది. అసలు ఏపీ చరిత్రలో లేని విధంగా సాధారణ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అలాగే పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించే విజయాలు దక్కించుకుంది. అటు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో కూడా భారీ మెజారిటీతో గెలిచింది. తాజాగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది.
మరి ఈ విజయాలన్నీ జగన్ పనితీరుకు నిదర్శనమే చెప్పుకోవచ్చు. జగన్ పాలనకు మెచ్చి ప్రజలు ఇస్తున్న తీర్పు అనే చెప్పొచ్చు. అలాగే వైసీపీ ప్రజా ప్రతినిధులు అద్బుత పనితీరు కనబర్చడం వల్ల ప్రజలు ఇచ్చిన మద్ధతు అని చెప్పొచ్చు. అయితే ఇవే నిజమా? అంటే పూర్తిగా ప్రజల మనసు అర్ధం చేసుకుంటే...పెద్దగా నిజం ఉండదనే తెలుస్తోంది.
అలా అని ఈ విజయాలని ఏ మాత్రం తక్కువ చేయకూడదు....అసలు జగన్‌కు ఇంకా ప్రజల మద్ధతు ఉందని ఈ ఫలితాలే చెబుతున్నాయి. కానీ ఈ ఫలితాలని చూసుకుని వైసీపీ నేతలు..తమకు ఇంకా తిరుగులేదని కళ్ళు మూసుకుంటే చిక్కులు తప్పవు. పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలు ఎలాంటి పరిస్తితుల్లో జరిగాయి....ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని కాదంటే తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు ఆలోచించారనే కోణాలు కూడా చూసుకోవాల్సిన అవసరముంది.
అయితే ఇప్పటికిప్పుడు వైసీపీకి తిరుగులేదు...అలాగే టి‌డి‌పికి సత్తా లేదు. కానీ ఇదే రియాలిటీ అని ఫీల్ అయితే....నెక్స్ట్ చిక్కుల్లో పడేది వైసీపీనే. కాబట్టి ఈ విజయాలని తలకెక్కించుకోకుండా పనిచేస్తే మళ్ళీ సత్తా చాటవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: