తెలుగుదేశం ఆ ప‌ని చేయ‌క‌పోతే 2024లోనూ క‌ష్ట‌మే..!

VUYYURU SUBHASH
పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ మ‌రోసారి ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నార‌న్న వార్త‌లు.. అటు జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్నార‌న్న వార్త‌లు ఏపీ రాజ‌కీయాల‌ను వేడెక్కించేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఎలా ఉంద‌న్న‌ది ప్ర‌శ్నించుకుంటే జ‌నాలు వైసీపీ వైపే ఉన్నారా ?  లేదా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారా ? అన్న‌ది ఆలోచించుకుంటే తెలుగుదేశం అనేక లోపాల‌తో కొట్టు మిట్టాడుతోన్న ప‌రిస్థితి ఉంది. మ‌ళ్లీ టీడీపీ 23 సీట్ల నుంచి అధికారంలోకి వ‌స్తుందా ? అన్న‌ది ప్ర‌శ్నించుకుంటే అనేక లోపాలు క‌నిపిస్తున్నాయి.
ప్ర‌స్తుతం తెలుగుదేశంకు యువ‌త‌ను ఆక‌ర్షించే గ్లామ‌ర్ లేదు. జ‌గ‌న్ యువ‌కుడు.. పైగా యువ సీఎం కావ‌డంతో ఆయ‌న‌కు సొంతంగా యూత్ ఇమేజ్ ఉంది. గ‌త ఎన్నిక‌ల‌లో యువ‌త అంతా వ‌న్ సైడ్‌గా జ‌గ‌న్‌కు ఓట్లేశారు. ఇక జ‌న‌సేన కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ యూత్ గ్లామ‌ర్ ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖ‌చ్చితంగా యువ‌త‌ను ఎంతో కొంత ఆకర్షిస్తాడు. మ‌రి యువ‌త అంతా జ‌గ‌న్‌, ప‌వ‌న్ వైపు మ‌ళ్లి పోతే టీడీపీ వైపు లేక‌పోతే ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆలోచించు కోవాలి.
పైగా ఏపీ ప‌ల్లెల్లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా యువ‌త ప‌వ‌న్ క‌ళ్యాన్ ఫ్లెక్సీలు గ‌ట్టిగా క‌డుతున్నారు. జ‌న‌సేన యువ‌త‌ను ఆక‌ర్షిస్తోంద‌ని అన‌డంలో సందేహం లేదు. పైగా కాపు ఓటు బ్యాంకు 28 శాతం వ‌ర‌కు ఉంది. ఇక 25 నుంచి 30 ఏళ్ల యువ‌త‌కు క్ర‌మ క్ర‌మంగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం త‌గ్గిపోతోంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే పార్టీ మ‌రోసారి ప్ర‌తిప‌క్షంలో ఉండ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇప్ప‌టి నుంచే చంద్ర‌బాబు.. టీడీపీ వాళ్లు దీనిపై దృ ష్టి పెట్టాల్సి ఉంది.
ఈ విష‌యంపై వీరు కాన్ సంట్రేష‌న్ చేయ‌క పోతే టీడీపీ మ‌రింత దారుణ స్థితికి దిగ‌జారి పోతుంద‌న డంలో సందేహం లేదు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: